Just In
- 17 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 48 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనసూయకు జీఎస్టీ అధికారుల షాక్.. వెంటనే చెల్లించాలని నోటీసులు
గత రెండు మూడు రోజులుగా పలువురు సెలబ్రిటీల ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో యాంకర్లు అనసూయ, సుమ, లావణ్య త్రిపాఠిల పేర్లు కూడా వచ్చాయి. అయితే అవన్నీ గాలి వార్తలేనని, వాటిని ఖండిస్తూ సుమ, అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తప్పుడు వార్తలు రాయడం నేరమని, రాసేముందు చెక్ చేసుకోండని మీడియాకు డైరెక్షన్లు కూడా ఇచ్చారు.

ఖండిస్తూ అనసూయ పోస్ట్..
ఆదివారం తన ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదంటూ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘నా ఇళ్లు బంజార హిల్స్‌లో లేదు. నా ఇంటి మీద ఏ ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులు రైడ్ చేయలేదు. మీడియా సమాచారం ఇవ్వాలిగాని, మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఊహలు వెల్లడించకూడదం'టూ క్లాస్ పీకింది.

ఎన్నో త్యాగాలతో..
వినోద రంగంలో కొనసాగుతూ పేరు, గౌరవం సంపాదించుకోవడానికి మేం ఎన్నో త్యాగాలు చేస్తున్నామని, పవర్ ఫుల్ హౌజ్ అయిన మీడియా సమాజానికి మంచి చేస్తూ, మంచి వైపు నడిపించే దిశగా ప్రయత్నించాలని పేర్కొంది. అంతేగాని ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తుల జీవితాలను కిందకు లాక్కూడదు. తానును మీడియాను గౌరవిస్తాననీ... ఓ వార్తను రాసేప్పుడు నిజానిజాలు సరిచూసుకోండి అంటూ మీడియాకు డైరెక్షన్లు ఇచ్చింది.

బకాయి పడ్డ అనసూయ..
అయితే అలాంటి దాడులేమీ జరగలేదని స్వయంగా అనసూయ ఖండించినా.. మళ్లీ అలాంటి వార్తలే పుట్టుకొస్తున్నాయి. సర్వీస్ ట్యాక్స్ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి పడిందని, అందులో కేవలం 25లక్షలు మాత్రమే కట్టిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

వెంటనే చెల్లించాలి..
దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.