»   » బాలయ్య పర్శనల్ పార్టీ: హంసానందిని తో డాన్స్

బాలయ్య పర్శనల్ పార్టీ: హంసానందిని తో డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ త్వరలో హంసానందినితో డాన్స్ చేయనున్నారని సమాచారం. అయితే అది సినిమా కోసం కాదట. ఓ ప్రెవేట్ పార్టీ ..అదీ బాలయ్య పుట్టిన రోజు పార్టీ అని తెలుస్తోంది. ఆయన పుట్టిన రోజుని ఈ సారి అమెరికాలో జూన్ 10న గ్రాండ్ గా చేయటానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్లు సమాచారం.

అమెరికాలో నివాశముంటున్న నందమూరి ఫ్యాన్స్...ఆయన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి బాలయ్యని ఇన్వేట్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ బర్తేడే పార్టీ జరగనుంది. ఈ పోగ్రాం లో కొంత ఫండ్ పోగుచేసి బసవతారకం కాన్సర్ హాస్పటిల్ కు ఇవ్వనున్నారు. నందమూరి బాలయ్య ఈ హాస్పటిల్ కు ప్రస్తుత ఛైర్మన్. ఆయన తండ్రి నందమూరి తారక రామారావు గారు ఈ హాస్పటిల్ ని బాలయ్య తల్లి , తన అర్దాంది అయిన బసవతారకం పేరన నిర్మించారు.

అలాగే ఈ పోగ్రామ్ లో భాగంగా హంసానందిని స్పెషల్ డాన్స్ పోగ్రాం ఏర్పాటు చేస్తున్నట్లు సమచారం. బాలయ్య కూడా ఆమెతో కలిసి డాన్స్ చేయనున్నారు. అంతేనా...ఈ బర్త్ డే పంక్షన్ లో గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు.

Hamsa Nandini to shake legs on Balayya’s b’day

బాలయ్య ప్రస్తుతం ఆయన తన ప్రెస్టేజియస్ ఫిల్మ్ గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మొరాకో ఉన్న ఆయన రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ క్రిష్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో ఎమోషన్స్ ప్రధానంగా భారీ విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ వారంతో అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగివస్తారు.

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.. తెలుగుజాతీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితాన్ని వెండితెరపై సాక్షాత్కరింప చేయనున్నారు దర్శకుడు క్రిష్, బాలయ్య మొరాకోలో షూటింగ్ మొదలెట్టిన సంగతి తెలిసిందే.

మొరాకోలో మేజర్‌ యాక్షన్‌ పార్టును షూట్‌ చేయనున్నారు. అప్పట్లో ఇక్కడి శాత కర్ఫి రాజరికం చేసిన టైంలో కోటలూ గట్రా ఎలా ఉండేవో. మొరాకో దేశంలో కొన్ని ప్రాంతాలు అలాగే ఉన్నాయట.. అందుకే సెట్‌ వేయకుండా యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి .. వాటికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ టచప్‌ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

English summary
Balayya is going to celebrate his birthday on 10th June in USA. It is heard that sizzling actress Hamsa Nandini will shake her legs in this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu