»   » కసితో బరువు తగ్గి మరీ ఆఫర్స్ సంపాదిస్తోంది

కసితో బరువు తగ్గి మరీ ఆఫర్స్ సంపాదిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్ : చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. మొన్నటిదాకా హన్సికని బొద్దుగుమ్మ అన్నారు.. ఇప్పుడు మాత్రం అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే... కందిరీగ నడుముతో సన్నగా తయారైంది. కష్టపడి తయారు చేసుకొన్న ఈ సరికొత్త రూపం ఆమెకి బాగానే కలిసొచ్చిందని తమిళ చిత్రసీమలో చెప్పుకొంటున్నారు. ఇటీవల హన్సికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. దర్శకులు కొత్త కథలు వినిపిస్తామంటూ వెంటపడుతున్నారట. వరస ఆఫర్స్ తో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇన్నాళ్ళూ బొద్దు పాపలాగ ఉందని ప్రక్కన పెట్టినవాళ్లంతా సై అంటూ ముందుకు దూకుతున్నారు.


ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ ''అవును, నేను రోజూ అయిదారు కథల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకొంటున్నా. కథల ఎంపికలో పరిణతి ప్రదర్శిస్తున్నా. గతంతో పోలిస్తే... తక్కువ తప్పులు చేస్తున్నాను. చేస్తున్న చాలా చిత్రాలు మంచి ఫలితాల్ని తెస్తున్నాయి''అని చెప్పుకొచ్చింది. అయితే సన్నబడటం వల్లే ఆఫర్స్ వస్తున్నాయట కదా? అని అడిగితే... ''అది పూర్తిగా అబద్ధం. బొద్దుగా ఉన్నప్పుడు బోలెడన్ని సినిమాలు చేశాను. ఇలా నాజూగ్గా తయారయ్యాక కూడా సినిమాలు చేస్తున్నా. బరువు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు'' అని చెప్పుకొచ్చింది.

పెళ్లి గురించి మాట్లాడుతూ ''నా చేతినిండా సినిమాలున్నాయి. వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నా. ఇక పెళ్లికొచ్చిన తొందరేముంది చెప్పండి? ఇంకా నా వయసు ఇరవై రెండే కదా?'' అని చెప్పుకొచ్చింది. హన్సిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బిర్యానీ' చిత్రంలో హన్సిక పాత్రికేయురాలిగా కనిపిస్తుందట.

'దేశముదురు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తరువాత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టడంతో కెరీర్ కోల్పోయింది. ఆ తరువాత తమిళానికి వెళ్లి గుడి కట్టించుకునే స్థాయికి వెళ్లింది. తాజాగా తెలుగులో నితిన్‌తో ఓ చిత్రం చేస్తోందట. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇప్పటికే నాగచైతన్య, మంచు విష్ణుతో మరో రెండు చిత్రాలకు కమిట్ అయింది. ఇదే సమయంలో తమిళంలోనూ నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది.

సుందర్.సి దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కూడా సిద్ధమైంది. ఇవన్నీ చూస్తుంటే గతంలో చెప్పినట్టుగా పెళ్లిచేసుకొని వెళ్లిపోయే ఆలోచన వాయిదా వేసినట్లు కనపడుతోంది. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు చేసుకుంటూ వెళితే మరో రెండు సంవత్సరాలన్నా సరిపోతాయి. మొత్తానికి పట్టుబట్టి మరీ బరువు తగ్గి తన అందాలకు పదును పెట్టిన హన్సిక మళ్లీ పీక్‌టైమ్‌లోకి చేరిందని అంటున్నారు సినీ జనం.

English summary
Bubbly Hanskia Motwani has been known as a chubby chick in film industry. Her plump looks had restricted her to some specific roles. Now, the actress has taken efforts to change the perception of the audience as she has shed oodles of weight. The girlfriend of Silambarasan aka Simbu often heard hard words from her detractors on her weight. Critics have commented on her plump body and it was said that her curves did not impress the mass audience. Well, she has now transformed herself as a slim beauty after working hard to shed her weight.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more