For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్ళికి సిద్దమైన హన్సిక.. ఆ పొలిటీషియన్ తోనేనా?

  |

  దేశముదురు సినిమాతో పదహారేళ్ళ వయసులోనే గ్లామరస్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది హన్సిక మోత్వాని. బాంబేకి చెందిన హన్సిక అతి తక్కువ కాలంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకోలేకపోయింది. ఎప్పటికప్పుడు మిగతా హీరోయిన్స్ కూడా పోటీ ఇవ్వలేకపోవడంతో చాలా అవకాశాలు చేతులరా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలోకి వెళితే

  చిన్న చిన్న పాత్రల్లో

  చిన్న చిన్న పాత్రల్లో

  హన్సికా మోత్వాని ముంబైలో సెటిల్ అయిన ఒక సింధీ ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక హన్సికా మోత్వాని చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఎక్కువ ఆసక్తి పెంచుకుంది. అందుకే చిన్ననాటి నుంచే నటించడం మొదలు పెట్టి పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక తన కెరీర్ ను 'షకలక బూమ్ బూమ్' టెలివిజన్ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ తరువాత ఆమె కొన్ని హిందీ హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది.

  చబ్బీగా

  చబ్బీగా

  స్కూల్ దశలోనే పదహారేళ్ళ వయసులోనే పూరి జగన్నాథ్ కంట పడడంతో అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ కు మెయిన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి అప్పట్లో హన్సికకు పదహారేళ్ళ వయసు అంటే ఎవరు నమ్మలేదు ఎందుకంటే అంత చబ్బీగా ఉండేది. ఇక ఆ తరువాత ఈ బ్యూటీకి రెండేళ్లలోనే మంచి గుర్తింపు దక్కింది.

  కరోనా ముందు వరకు

  కరోనా ముందు వరకు

  ఈ క్రమంలోనే ఆమె తమిళ్, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లోనూ నటించి మంచి ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులో మస్కా, కందిరీగ వంటి సినిమాలతో అఆమె మంచి గుర్తింపు అందుకుంది.ఇక తమిళంలో సూర్య, విజయ్ వంటి అగ్ర హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం అగ్రహీరోలతో నే కాకుండా యువ హీరోలతో కూడా నటించిన ఈ బ్యూటీకి కరోనా ముందు వరకు కూడా మంచి అవకాశాలు దక్కాయి.

  Recommended Video

  సీతా రాముల ప్రేమ కావ్యం, ఓ అద్భుతం *Reviews | Telugu FilmiBeat
  చివరగా

  చివరగా

  అయితే చివరగా తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో నటించింది . ఆ అనంతరం మహా అనే పాన్ ఇండియా సినిమా చేసింది కానీ ఆ సినిమా హిట్ అవలేదు. అయితే త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. దక్షిణాదికి చెందిన ఓ బడా పోలిటీషియన్‌ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

  అధికారిక ప్రకటన కూడా

  అధికారిక ప్రకటన కూడా

  అయితే అది నిజం కాదని, ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో సెటిల్ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారు అని అతి త్వరలో నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది.

  English summary
  As per social media buzz, hansika motwani is all set to marry a south based politician soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X