»   » అందుకే బాలకృష్ణతో చేయటానికి హన్సిక ఒప్పుకుందా?

అందుకే బాలకృష్ణతో చేయటానికి హన్సిక ఒప్పుకుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఇకనుంచి కుర్ర హీరోలకే నా డేట్స్..ముదురు హీరోలకు నో' అని చెప్పిన హన్సిహ హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని బాలయ్య ప్రక్కన సెటిలైంది. బాలకృష్ణ తాజా చిత్రం పరమవీర చక్ర చిత్రంలో హీరోయిన్ గా కనిపించి కనువిందు చేయబోతోంది. ఏమిటా కారణం అంటే అస్సలు ఏ చిత్రం చేయకుండా ఉంటే తెలుగులో పూర్తిగా మర్చిపోతారనే భయం ఓ ప్రక్క అయితే, ఆమె అనుకున్న రెమ్యునేషన్ కి దగ్గరగానే నిర్మాత సి.కళ్యాణ్ ఆఫర్ చేయటం ఓ కారణం అంటున్నారు. అలాగే రీసెంట్ గా సింహా వంటి సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ప్రక్కన చేయటం మళ్ళీ కెరీర్ టర్న్ అవుతోందని భావిస్తోందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కాదని దాసరిని కాదని తెలుగు ఇండస్ట్రీలో మనుగడ కష్టమని శ్రేయాభిలాషులు చెప్పబట్టే ఆమె ఒప్పుకుందంటున్నారు. అయితే హన్సిక మాత్రం గ్యారెంటీగా తన పాత్ర బాగా నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతం హన్సిక తమిళంలో ధనుష్ సరసన మాఫిళ్ళై చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu