»   » మహేష్ కోసం మళ్లీ హ్యారీస్ జైరాజ్

మహేష్ కోసం మళ్లీ హ్యారీస్ జైరాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్వరలో సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ ..మహేష్ బాబు చిత్రానికి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు మురగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. గతంలో మహేష్, హ్యారీస్ కాంబినేషన్ లో సైనికుడు చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అందులో పాటలు మంచి హిట్టయ్యాయి.

ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న దర్శకుడు మహేష్ తన తదుపరి చిత్రానికి రంగం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రాన్ని దర్శకుడు మురగదాస్ తో చేయనున్నారు. ఈ మేరకు లాంచింగ్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రం ఏప్రియల్ 12 , 2016న లాంచ్ చేయటానికి తేదీని ఖరారు చేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి మరో వార్త వెలుగులోకి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Harris Confirmed For Mahesh, Murugadoss movie

ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ మరియు దర్శకుడు సంతోష్ శివన్ పనిచేయునున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంతోష్ శివన్ ఖరారు చేసి మరీ చెప్పారు. వచ్చే ఏప్రియల్ నుంచీ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలియచేసారు. అందుతున్న సమాచారం బట్టి ఈ చిత్రం 110 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది.

ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. శృతి హాసన్ హీరోయిన్ గా చేసే అవకాసం ఉందని వినికిడి. అలాగే మరో హీరోయిన్ గా అలియా భట్ ని కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా మహేష్ ..శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కంటిన్యూగా ..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇప్పుడు బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు. జనవరికు ఆ చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి రేసులో ఉండే ప్లానింగ్ లో ఉన్నాడు. దాంతో మహేష్ సినిమాల మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది.

English summary
AR Muragadoss will next be seen directing Super Star Mahesh Babu and the film is being in the pre production works. The makers of the film have roped in highly talented Harris Jayraj.
Please Wait while comments are loading...