»   » మహేష్ బాబు మూవీలో విలన్‌గా హాలీవుడ్ యాక్టర్?

మహేష్ బాబు మూవీలో విలన్‌గా హాలీవుడ్ యాక్టర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్న మహేష్ ..తన తదుపరి చిత్రంగా మురుగుదాస్ సినిమా ని ఓకే చేసారు. ఈ చిత్రం పూర్తి కాగానే కొద్ది పాటి గ్యాప్ తో ఆ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ కు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి.

సుమారు 100 కోట్ల బడ్జేట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా, సోషల్ రెస్పాన్సిబులిటి మీదే ఈ కథ ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన లోకేషన్స్ కోసం మురుగుదాస్, కెమెరామెన్ సంతోష్ శివన్ ముంబాయి పరిసర ప్రాంతలు తిరుగుతున్నారు. ఇది ముంబాయ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

కాగా... ఈ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ యాక్టర్ నటించబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ నటుడు హారిసన్ ఫోర్డ్ ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ నుండి వస్తున్నాడు కాబట్టి అతడికి కెమ్యూనరేషన్ కూడా భారీగానే ముట్టజెబుతున్నట్లు సమాచారం.

Harrison Ford to play baddie role in Mahesh’s next?

ఈ సినిమాకు ఠాగుర్ మధు మరియు ఎన్.వి. ప్రశాద్ లు ప్రోడ్యుసర్స్ గా ఉన్నారు. హీరోయిన్ కోసం ఇంకా వేటలోనే ఉన్నారు. కుదిరితే కనుక బాలివుడ్ భామ శ్రద్దా కవూర్ ని తీసుకోవడం పై పరీశీలిస్తున్నారు.

మురుగదాస్ గతంలో తమిళంలో తీసిన రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో... ‘ఠాగూర్' పేరుతో రీమేక్ చేసారు. తర్వాత మురుగదాస్, చిరంజీవి కాంబినేషన్లో ‘స్టాలిన్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ కలిసి మరో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనుకున్నారు.

చిరంజీవిని మైండ్ లో పెట్టుకుని మురుగదాస్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు. అయితే చిరంజీవికి ఆ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసారు. మురుగదాస్ అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబుకు నచ్చడంతో ఓకే చేసారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Hollywood actor Harrison Ford to play baddie role in Mahesh Babu’s next, Directed by AR Murugudoss.
Please Wait while comments are loading...