»   »  సానియా మీర్జా...నవదీప్ ఎఫైర్ నిజమేనా?

సానియా మీర్జా...నవదీప్ ఎఫైర్ నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sania Mirza
స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా తాజాగా తెలుగు హీరో నవదీప్ తో లవ్ ఎఫైర్ నడుపుతోందంటూ ఎక్కడ చూసినా వార్తలు కనిపిస్తున్నాయి. అయితే అవి చదివిన లేదా విన్న చాలమంది సానియా ఏంటి ...నవదీప్ తో వ్యవహారం ఏంటి మరీ అర్ధం పర్ధం లేకుడ్ గాసిప్స్ పుట్టించేస్తున్నారంటూ అని విసుక్కున్నారు. అయితే అది నిజమే అనిపించేటట్లు కనపడేటట్లు నవదీప్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అదెలా జరిగిందంటే ఈ వ్యవహారం పై స్టోరీ చేద్దామనుకున్న ముంబయి కి చెందిన ఓ పత్రిక వారు ఓ అడుగు ముందుకేసి నవదీప్ నెంబర్ పట్టుకుని అతను బ్యాంకాక్ లో ఉంటే ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు.

దానికి నవదీప్ ఉషారుగా స్పందిస్తూ...సానియా నేనూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకర్నొకరం పరిచయం అయ్యాం. మొల్లిగా ఆ పరిచయం ప్రెండ్ షిప్ కి దారి తీసింది. అలాగే మేమిద్దరం ఒకే జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తాం. అప్పుడప్పుడూ కలుస్తాం. అంతే అంతకు మించి నేనేమి కామెంట్ చేయనన్నాడు. దాంతో విషయం పూర్తిగా చెప్పవచ్చుకదా అని విసుక్కుని ఆమె వెర్షన్ తీసుకుందామని ట్రై చేసారు. అయితే ఆమె నో కామెంట్ అంది. సర్లే అని అతని ప్రెండ్స్ ని పట్టుకుని ఎంక్వైరీ చేసారు.

వాళ్ళు నవదీప్ వెర్షన్ నే బలపరుస్తూ మీకొచ్చిన డౌట్ కరెక్టే డిన్నర్ ,లంచ్ అన్న తేడా లేకుండా వారిద్దరూ కలిసి తిరుగుతున్నారు. మా అందరికీ కూడా సానియాని పరిచయం చేసాడు. నవదీప్ సెన్సాఫ్ హ్యూమర్ ని ఆమె భలే ఎంజాయ్ చేస్తుందంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. ఇంతకీ నవదీప్ కావాలనే అర్ధోక్తిలో ఆపి తనపై రూమర్స్ మరింత పెరగాలని ఫ్రెండ్స్ తో కలసి సెల్ప్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడా...లేక నిజంగా వారిద్దరు మధ్య ఏమన్నా మేటర్ నడుస్తోందా అని వారు ఆలోచనలో పడి అదే ప్రింట్ చేసారు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X