»   » “లోఫర్”: పవన్ విలనే... వరుణ్ తేజ కి కూడా...

“లోఫర్”: పవన్ విలనే... వరుణ్ తేజ కి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో "లోఫర్" చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం రాజస్ధాన్ లోని జోధాపూర్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసి వచ్చింది. అతను మరెవరో కాదు...చంద్రదీప్ సురనేని..పటాస్, జిల్లా చిత్రాలల్లో విలన్ గా చేసారు. ఈ చిత్రం ద్వారా తనకు బ్రేక్ వస్తుందని చంద్రదీప్ భావిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ ..గబ్బర్ సింగ్ 2 లోనూ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్ తేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా కంచె టైటిల్ తో చిత్రం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.

He is Varun Tej's villain in 'Loafer'

‘టిట్టో ఎంబిఏ', ‘విరాట్టు', ఇండో - కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ'లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

He is Varun Tej's villain in 'Loafer'

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

English summary
Actor Charandeep Surneni who is seen as villain in movies like Pataas and Jilla is now teaming up with Varun Tej for the first time. Apart from Loafer, Charandeep is also part of Baabai Pawan Kalyan's Gabbar Singh 2 alias Sardar.
Please Wait while comments are loading...