»   » జయసుధవల్లే అంటున్నారు... సెట్లోనే వాగ్వివాదం... షూటింగ్ ఆగినట్టే

జయసుధవల్లే అంటున్నారు... సెట్లోనే వాగ్వివాదం... షూటింగ్ ఆగినట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

వినూత్న‌మైన క‌థాంశంతో తెర‌కెక్కి రూ.25 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన 'బిచ్చ‌గాడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన సంస్థ శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్. ప్ర‌జ‌ల‌కు ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ వారిలో నిత్యం చైత‌న్యాన్ని నింపడానికి వెండితెర మార్గాన్ని ఎంపిక చేసుకున్న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారి స‌హ‌జ‌న‌టి అని తెలుగువారి చేత అభిమానంగా పిలిపించుకుంటున్న న‌టి జ‌య‌సుధ‌.

ఇప్పుడు ఈ ముగ్గురూ అంటే శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్, పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ క‌లిసి ఓ సినిమాకు ప‌నిచేయ‌నున్నారు.అన్న వార్త వినగానే మరో సామాజిక కోణం లో మంచి సినిమా వస్తుందన్న ఆసక్తితో చూసారంతా.. 'ఒరేయ్.. రిక్షా' చిత్రం త‌ర్వాత త‌న స్వంత నిర్మాణ సంస్థ‌లో కాకుండా, ఎంతో మంది ద‌ర్శ‌కులు, నిర్మాణ సంస్థ‌లు ఎంత మంచి ఆఫ‌ర్ ఇచ్చినా ఒప్పుకోకుండా, క‌థ న‌చ్చ‌డంతో పాటు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుపై అభిమానంతో శ్రీతిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌లో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి న‌టిస్తున్న చిత్ర‌మిదే కావ‌డం విశేషం. అయితే ఇప్పుడు ఈ సినిమా షూట్ ఆగిపోయింది ఎందుకంటే.....

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌:

హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌:

చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌గా రూపొంద‌నున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌' సినిమాకు క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లేను అందించి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు నిర్వ‌హిస్తున్నారు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాలంటేనే సంగీతానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది.

వందేమాత‌రం శ్రీనివాస్:

వందేమాత‌రం శ్రీనివాస్:

అలాంటిది ఆయ‌నే క‌థానాయ‌కునిగా న‌టిస్తున్న సినిమాకు పాట‌లు ఎంత‌టి కీల‌క‌పాత్ర‌ను పోషిస్తాయో వేరుగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ విష‌యాన్ని ముందే గ‌మ‌నించిన చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు పాట‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు వందేమాత‌రం శ్రీనివాస్ చేత సంగీతాన్ని చేయించుకోవ‌డానికి స‌న్న‌ద్ధుల‌య్యారు.

నీతి, నిజాయితీ:

నీతి, నిజాయితీ:

నీతి, నిజాయితీ గ‌ల ఓ పోలీస్ అధికారి నిజ జీవితంలో, వృత్తిప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు? వాటిని అదిగ‌మించి విజ‌య‌మెలా సాధించాడ‌నేదే క‌థాంశం. డిఫ‌రెంట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. సినిమాలంటే ఆస‌క్తితో చిత్ర నిర్మాణ రంగంలో అడుగు పెట్టిన నాకు, కుటుంబ‌ విలువ‌ల‌తో సాగే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నిపించింది.

నారాయణ మూర్తి సినిమా:

నారాయణ మూర్తి సినిమా:

కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే భావోద్వేగాల‌తో పాటు అన్ని ర‌కాల వాణిజ్య విలువ‌ల‌ను జోడించి తెర‌కెక్కిస్తాం. త‌ప్ప‌కుండా మా 'హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌' అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంద‌ని మాత్రం ధీమాను వ్య‌క్తం చేస్తున్నాను' అంటూ నారాయణ మూర్తి చెప్పటం కూడా సినిమాకి ఒక విధమైన హైప్ తెచ్చింది. మరీ కమర్షియల్ సినిమాలుగా కాకున్నా నారాయణ మూర్తి సినిమా అంటే ఒక మంచి అభిప్రాయమే ఉంటుంది జనాల్లో.

కారణమేమిటీ:

కారణమేమిటీ:

అలాంటి సినిమా ఇప్పుడు ఆగిపోయింది. తాత్కాలికంగానే ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. ఇంతకీ కారణమేమిటీ అని చూస్తే కాస్త భాదనిపించటం సహజమే... సీనియర్ నటీనటులకి డిసిప్లిన్ ఎక్కువని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ వుంటారు. అయితే కొందరు మాత్రం స్పాట్కి టైమ్ కి రావడానికి అంతగా ఆసక్తి చూపించరట.

జయసుధకి కోపం వచ్చి:

జయసుధకి కోపం వచ్చి:

రిలో సీనియర్ నటి జయసుధ కూడా వున్నట్టు సమాచారం. ప్రస్తుతం జయసుధ 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' అనే చిత్రంలో విప్లవ చిత్రాల నాయకుడు ఆర్. నారాయణమూర్తి భార్య పాత్ర చేస్తున్నారు. చదలవాడ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సడన్గా ఆగిపోయింది. దీనికి కారణం జయసుధ అని భోగట్టా. తరచుగా షూటింగ్కి లేట్ గా వస్తోన్న జయసుధతో చదలవాడ సమయానికి రావాలని చెప్పారట. దాంతో జయసుధకి కోపం వచ్చి, ఆయనతో వాగ్వాదానికి దిగి సెట్నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయి, మళ్లీ ఆ షూటింగ్కి వెళ్లలేదట.

బడ్జెట్ పరిధులు దాటిపోతుంది:

బడ్జెట్ పరిధులు దాటిపోతుంది:

ఆమెని కాంటాక్ట్ చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ జయసుధ నుంచి బదులు రాలేదట. కీలకమైన పాత్ర చేస్తున్న జయసుధ లేకపోవడంతో షూటింగ్ షెడ్యూల్ మొత్తం అప్సెట్ అయి సినిమా మధ్యలో నిలిచిపోయిందట. ఇప్పుడు ఆమెకి బదులుగా మరొకర్ని తీసుకోవాలా లేక తననే బతిమాలుకోవాలా తెలీక చదలవాడ తల పట్టుకున్నారట. జయసుధని రీప్లేస్ చేసినట్టయితే ఇంతవరకు షూటింగ్ చేసిన దాంట్లో చాలా భాగం వృధా అయి బడ్జెట్ పరిధులు దాటిపోతుందట.

English summary
according to reports "Head Constable Venkataramaiah" Movie Shooting stopped, because of senior actress Jayasudha behavior on sets
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu