»   » బాబు కన్నడం లో ట్రై చేయటం బెస్ట్

బాబు కన్నడం లో ట్రై చేయటం బెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సాయి కుమార్ కుమారుడు ఆది ఆశలపై 'ప్యార్ మే పడిపోయానే' నీళ్లు జల్లినట్లే అని తెలుస్తోంది. ఘన విజయం సాధించి తన కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుందని అనుకుని చేసిన ఈ ప్రేమ కధా చిత్రం రొటిన్ ప్రేమ కధగా మిగిలిపోయి నిరాశమిగిల్చింది. అవుట్ డేటెడ్ కథ, అంతకుమించిన పురాతన కాలం నాటి స్త్రీన్ ప్లే సినిమాని నిలబెట్టలేవని తేల్చేసాయి. ఆది కూడా నటనలో ఏ మాత్రం ఇంప్రూవ్ కాకుండా తొలి చిత్రం ప్రేమే కావాలి నాటి ఎక్సప్రెషన్స్ తోటే లాక్కొచ్చాడు. హీరోయిన్ మాత్రం తనను పెట్టుకుంది కేవలం అందాల కోసమే అన్నట్లు..నటన మర్చిపోయి రెచ్చిపోయింది. అనూప్ మ్యాజిక్ కూడా మ్యాజిక్ చేయలేకపోయింది. దాంతో అంతంత మాత్రం ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం భాక్సీఫీస్ వద్ద వర్కవుట్ అవటం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

  ఈ నేపధ్యంలో ఆది...తన తండ్రి ఏలిన కన్నడ పరిశ్రమలో ప్రవేశించి అక్కడ అదరకొడితే బెస్ట్ అంటున్నారు. అందులోనూ ఆది కి సైతం అక్కడ నుంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నాడు. ఈ విషయమై ఆది మాట్లాడుతూ...కన్నడంలో చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ నన్ను నేను నిరూపించుకోవాలి. ఇక్కడ నిరూపించుకోకుండా కన్నడంలోకి ప్రవేశిస్తే ఇక్కడ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు కాబట్టే కన్నడ చిత్రసీమకు వెళ్లాడంటారు. ఇక్కడ నిరూపించుకున్న తరువాతే కన్నడ గురించి ఆలోచిస్తాను అన్నారు.

  Hero Aadi Suitable for Kannada Films

  అలాగే... " సరిగ్గా ఏడాది క్రితం 'సుకుమారుడు' చేశాను. అది నేను ఆశించినట్లు ఆడలేదు. దాని తర్వాత లవ్‌స్టోరీలు చేయమని చాలా మంది చెప్పారు. అలాంటి టైమ్‌లోనే రవి చావలి గారు ఈ కథ వినిపించారు. తన తరహాకి భిన్నంగా తయారుచేసిన స్క్రిప్ట్ అని కూడా చెప్పారు. నాకు కథ నచ్చింది. అలాగే నిర్మాత రాధామోహన్ గారు 'లవ్‌లీ' తర్వాత నాతో ఓ సినిమా చేయాలనుకున్నారు. ముందుగా వేరే సబ్జెక్ట్ అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఈ సినిమాకి కుదిరింది. మ్యూజిక్ కోసం అనూప్‌ని సంప్రదించాను. అప్పటికి తను 'ఆటోనగర్ సూర్య', 'మనం', మరికొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ నాతో ఉన్న అనుబంధం కారణంగా తను ఈ సినిమాకి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. సినిమాలో ఓ భాగమయ్యేట్లు ఎప్పటిలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.

  ఇది మ్యూజికల్ లవ్‌స్టోరీ. స్టోరీలోని ఫ్రెష్‌నెస్, హీరో క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయి. అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్ నుంచి నలుగురు కుర్రాళ్లు ఇందులో నా ఫ్రెండ్స్‌గా పరిచయమవుతున్నారు. నాది మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్. శాన్విది సింగర్ రోల్. ప్రేమించాలి కానీ, దాని కోసం చావకూడదనే పాత్ర నాది. అలాంటివాడు ప్రేమించిన అమ్మాయి లేకుండా చనిపోతాననుకునే స్థాయికి ఎలా వెళ్లాడు? ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? అనేది ప్రధానాంశం. 'రఫ్' సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను. త్వరలోనే ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సగటు మనిషికి ప్రతినిథిగా ఉండే పాత్రలు చేయాలని ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం నా వయసుకు తగినట్లు ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నా. '' అని చెప్పారు.

  ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహ, పృథ్వి, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా ఝనక్, మాధవి సిద్ధం, విష్ణుప్రియ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: కె.కె. రాధామోహన్, రచన-దర్శకత్వం: రవిచావలి.

  English summary
  Aadi said..." Right now, my concentration is upon Tollywood alone. I’ll think of Kannada films once I’ve proved myself here. There is a long way to go!". Aadi, Shanvi starrer Pyaar Mein Padipoyane released yesterday with divide talk.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more