»   » చిరును 'ఛీ' కొట్టి బాలయ్య క్యాంపులో చేరిన హీరో..!!

చిరును 'ఛీ' కొట్టి బాలయ్య క్యాంపులో చేరిన హీరో..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. చిరు తన అన్నయ్య అని, గురువు అని అనేక సందర్భాల్లో చెప్పాడు. చిరంజీవి కోసమే రెండు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ సినిమా మొదలవ్వాలంటే చిరంజీవి వచ్చి క్లాప్ కొట్టాల్సిందే, లేదంటే ముహూర్తాన్ని కూడా వాయిదా వేసేవాడట. రాజకీయాల్లో ఎంతో బిజీగా వున్నా చిరు కూడా శ్రీకాంత్ పిలవగనే వచ్చి క్లాప్ కొట్టేవాడు. శ్రీకాంత్ 100వ చిత్రం మహాత్మకు కూడా చిరంజీవే క్లాప్ కొట్టాడు.

కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. శ్రీకాంత్ చిరు కాంపౌండ్ లో అస్సలు కనిపించడం లేదు. చిరు పేరును కూడా అతను ఎక్కడా ఎత్తడం లేదు. దీనికి తోడు ఇటీవల మొదలయిన ఆయన కొత్త సినిమా రంగా ది దొంగ సినిమాకు చిరుతో కాకుండా బాలకృష్ణతో క్లాప్ కొట్టించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో ఇదేంటి శ్రీకాంత్ ఈ మధ్య పార్టీ మార్చాడా..!? చిరును ఛీ కొట్టి బాలయ్య క్యాంపులో చేరాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu