»   »  విశాల్ దర్శకత్వం... ?

విశాల్ దర్శకత్వం... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vishal
'పందెంకోడి' లా తెలగు పరిశ్రమ లో ప్రవేసించి పోరాడుతూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో విశాల్. ప్రస్తుతం అతను సెల్యూట్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానుసారంగా విశాల్ గుండుతో దర్శనమియ్యనున్నారట. నయనతార అందచందాలు, విశాల్ చేసిన యాక్షన్ ఎపిసోడ్లు ప్రధాన ఆకర్షణలుగా నడిచే ఈ కథనం పోలీస్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సమయంలో అతనికి దర్శకుడిగానూ నిరూపించుకోవాలని కోరిక పుట్టిందిట. దాంతో సెట్లో దర్శకుడిని ప్రక్కన పెట్టి యాక్షన్ కట్ చెప్తున్నాడుట. రాజశేఖర్ అనే ఆ తమిళ దర్శకుడు కొత్తవాడటం విశాల్ సొంత సినిమా కావటంతో అతన్నియేమి అనలేకపోతున్నాడుట. ఈ విషయం గమనించిన కొందరు లోపాయికారిగా ఎంక్వైరీ చేస్తే త్వరలో విశాల్ దర్శకత్వంలో ఓ చిత్రం కి ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో హాలీవుడ్ తరహాలో చిత్రీకరణ జరుపుతారుట. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ దాదాపు మూడొంతులు న్యూయార్క్‌లో షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారుట. అందుకే ఈ ప్రాక్టీసుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X