»   » బాలకృష్ణకి ఆ సమస్య తీరేటట్లు లేదు

బాలకృష్ణకి ఆ సమస్య తీరేటట్లు లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ సినిమాకు హీరోయిన్ల సమస్య వచ్చి పడిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాకు కొత్త హీరోయిన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఏ హీరోయిన్ ఇంకా సెట్ కాలేదని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ను ఇప్పటికే ఎంపిక చేసినా కొత్త వారి కోసం అన్వేషిస్తున్నారు. గత కొన్ని చిత్రాల నుంచి హీరోయిన్స్ బాలకృష్ణ కు సమస్యగా మారింది. బాలకృష్ణ ఏజ్ కి,ఫిజిక్ కి తగిన హీరోయిన్ కావటం,సెట్ లో డిసిప్లెన్డ్ గా ఉండటం వంటి అంశాలు కలిగిన హీరోయిన్ ని వెతుకుతున్నారు.

చిత్రానికి సంభందించిన కీలక వ్యక్తులు మాట్లాడుతూ.... 'కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవర్నీ ఇంకా ఎంపిక చేయలేదు. కొత్త హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నాం. అవసరమైతే బాలీవుడ్ నుంచి ఒకర్ని ఎంపిక చేస్తాం. వారం రోజుల్లో పేరును ఖరారు చేస్తాం" అని తెలిపారు. రెండో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్‌ని ఇప్పటికే ఎంపిక చేశారు. మెయిన్ హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. నయనతార ఈ పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఏ మాత్రం నిజం లేదని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ప్రధాన హీరోయిన్ ను ఎంపిక చేస్తారు.

బాలయ్య సినిమాలో మరో హీరో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ 'సింహా' తర్వాత వీర్దిదరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా భావించి బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాల భోగట్టా. 'సింహా'ను మించే స్థాయిలో ఇందులో బాలయ్య పాత్ర చిత్రణ ఉంటుందని తెలుస్తోంది. కథ, కథనం, బాలకృష్ణ ఆహార్యం, సంభాషణలు, సంగీతం ఇలా... ప్రతి అంశం అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని వినికిడి. కథ రీత్యా ఇందులో ఇద్దరు హీరోయిన్స్ .

అలాగే టైటిల్గా 'రూలర్', 'జయసింహ' తదితర పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే అధికారికంగా ప్రకటించాల్సివుంది. 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి సమర్పణలో 'దూకుడు' నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర '14 రీల్స్ ఎంటర్టైన్మెంట్' సంస్ధ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్యకు దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. గీతాలే కాదు, నేపథ్య సంగీతం అందించడంలో దేవిశ్రీప్రసాద్ దిట్ట. మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా ఏ స్థాయిలో దేవిశ్రీ రీ-రికార్డింగ్ అందిస్తారో చూడాలి.

English summary
Makers of Nandamuri Balakrishna‘s current film... Jaya Simha (working title) are having a tough time in finding heroines for Balayya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu