»   » హద్దు మీరొద్దు.. మాటలు జాగ్రత్త.. ధనుష్‌కు హీరోయిన్ షాక్..

హద్దు మీరొద్దు.. మాటలు జాగ్రత్త.. ధనుష్‌కు హీరోయిన్ షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో ధనుష్‌కు మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ షాక్ ఇచ్చింది. హద్దు మీర వద్దు జాగ్రత్తగా మాట్లాడాలని ఆమె హెచ్చరించడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే సుచీలీక్స్ వివాదం, ధనుష్ తన కుమారుడేననే పిటిషన్ దాఖలైన నేపథ్యంలో తాజాగా మడోన్నాతో వివాదం వార్తలకు ఎక్కింది. ప్రేమమ్ చిత్రంతో మడోన్నా సెబాస్టియన్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పవర్ పాండీ షూటింగ్‌లో..

పవర్ పాండీ షూటింగ్‌లో..

పవర్ పాండీ చిత్ర షూటింగ్ సమయంలో ధనుష్, మడోన్నా మధ్య ఎదో చిన్న ఘర్షణ చిలికి చిలికి పెద్దగా మారిందట. ఈ వ్యవహారంలో ధనుష్ ప్రవర్తనతో మడోన్నా మనస్తాపం చెందినట్టు సమాచారం. ఈ విషయంపై ధనుష్ ఏదో వ్యాఖ్యానించగా అందుకు మడోనా ధీటుగా సమాధానం ఇచ్చినట్టు తమిళ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి.

మడొన్నా వార్నింగ్

మడొన్నా వార్నింగ్

తమ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణంపై మడోన్నా తీవ్ర స్థాయిలో ఓ సందేశాన్ని పంపించినట్టు తెలిసింది. ‘హద్దు మీరి మాట్లాడొద్దు.. జాగ్రత్త' అనే మెసేజ్‌ను ధనుష్‌కు పంపించినట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే దక్షిణాదిలో గుర్తింపు పొందుతున్న మడోన్నా ఈ విధంగా వ్యవహరించడంపై కొందర్ని షాక్ గురిచేసినట్టు తెలుస్తున్నది.

ప్రమోషన్‌కు దూరం

ప్రమోషన్‌కు దూరం

ధనుష్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవర్ పాండీ చిత్ర ప్రమోషన్‌కు దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాదం అనేక రూమర్లకు ఊతమిస్తున్నదనే విమర్శ తమిళ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నది.

ఇంతకీ ఏం జరిగింది..

ఇంతకీ ఏం జరిగింది..

ఇంతకీ వారి మధ్య ఏం జరిగింది. ఎందుకు మడోన్నా తీవ్రంగా స్పందించింది. వివాదాలకు దూరంగా ఉండే ధనుష్ ఎమన్నారు.. మడోన్నా పంపిన మెసేజ్ ఏంటీ.. అది బయటకు ఎలా వచ్చింది. దానిపై రూమర్లు ఎందుకు వెలుగు చూస్తున్నాయనేది అంతు పట్టని విషయంగా మారింది.

ధనుష్ హిట్

ధనుష్ హిట్

తొలిసారి దర్శకత్వం వహిస్తున్న పవర్ పాండీ చిత్రంపై ఒకరోజు ముందుగానే కోలీవుడ్‌లో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ చిత్రం ఏప్రిల్ 14 (శుక్రవారం) విడుదల కానున్నది. ఈ చిత్రంలో రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ధనుష్, మడోన్నాలు ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్‌లో యంగ్ రాజ్ కిరణ్‌గా ధనుష్, యువ రేవతిగా మడోన్నాలు నటించారు. ధనుష్ తొలి చిత్రంతోనే ధనుష్ విమర్శల ప్రశంసలు అందుకొన్నారు.

English summary
Premam heroine Madonna Sebastian has messaged Dhanush to mind his words. To add grist to the rumour mill, Madonna stayed away from the promotions of Power Pondy, in which she paired up with Dhanush.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu