Don't Miss!
- Lifestyle
మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?
- News
తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 2.73 శాతం డీఏ మంజూరు
- Sports
Womens IPL టీమ్స్ వేలం.. రేసులో బడా కంపెనీలు! బీసీసీఐకి రూ.4 వేల కోట్లు!
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
నందమూరి బాలకృష్ణతో మరోసారి హానీ రోజ్.. ఈసారి మరింత కిక్కిచ్చేలా రొమాంటిక్ రోల్?
టాలీవుడ్ ఊర మాస్ హీరో నందమూరి బాలకృష్ణ మొత్తానికి వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే అఖండ వీర సింహారెడ్డి సినిమాల తర్వాత బాలకృష్ణ చేయబోయే తదుపరి సినిమా పై కూడా అంచనాలు భారీ స్థాయిలోనే క్రియేట్ అవుతున్నాయి.
ఇక ఆ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు అప్పుడే వివిధ రకాల గాసిప్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ 108వ సినిమాలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈ కాంబినేషన్లో రాబోయే సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ లీల బాలకృష్ణ కూతురు పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మరొక సీనియర్ హీరోయిన్ పాత్రను కూడా ఫైనల్ చేయాలని అనిల్ రావిపూడి చర్చలు జరుపుతున్నాడు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మలయాళం బ్యూటీ హనీ రోజ్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబతునట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుతో కలిసి నటించి మంచి గుర్తింపును అందుకున్న హానీ రోజ్ ఇప్పుడు ఈవెంట్స్ లో చాలా హైలెట్ గా నిలుస్తోంది.

అయితే అనిల్ రావిపూడి కూడా ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు అయితే ఈ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇచ్చింది లేదు. మరికొందరు మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని కూడా కొట్టి పారేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీగా వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక హానీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపికి గా మారింది. ఆమెకు ప్రస్తుతం తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయట. మరి రాబోయే సినిమాలతో అమ్మడు ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.