»   » రాణీ రుద్రమ దేవి పాత్రలో అనుష్క!?

రాణీ రుద్రమ దేవి పాత్రలో అనుష్క!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరుంధతిగా అదరకొట్టి భాక్సాఫీస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన అనుష్క త్వరలో రాణి రుద్రమ దేవి గా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. భారీ సెట్టింగులతో చిత్రాలు తీసే గుణశేఖర్ ఈ ప్రాజెక్టును భుజాన ఎత్తుకోనున్నారు. ఇందుకోసం ఆయన స్క్రిప్టు వర్క్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టోరీ బోర్డ్ లు కూడా రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ తో చేస్తున్న వరుడు ముగింపు దశకు చేరుకోవటంతో ఈ కొత్త ప్రాజెక్టుపైనే ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి దాదాపు నలభై కోట్ల వరకూ ఖర్చు అవనుందని వినికిడి. మగధీర, అరుంధతి రికార్డులను బ్రధ్దలు కొట్టే రీతిలో చిత్రీకరణ జరపాలని గుణశేఖర్ భావిస్తున్నారు. ఇంతకు ముందు కూడా గుణశేఖర్ గోన గన్నారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించుదామని ప్రయత్నించారు. కానీ కలిసిరాలేదు. ఈ సారి గన్నారెడ్డి పాత్రను కుదించి రుద్రమ సైన్యాధ్యుక్షుగా చూపుతూ ఆ సీన్స్ వర్కవుట్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇంత పెట్టుబడి పెట్టే నిర్మాత ఎవరన్నది అందరికీ సందేహం వస్తున్నా...గుణశేఖర్ ఇప్పటికే ఇద్దరు,ముగ్గరు పెద్ద నిర్మాతలకు చెప్పటం జరిగిందని, వారు ఇచ్చిన భరోసాతోటే స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చుంటున్నారని అంటున్నారు. అంటే అనుకూలిస్తే ఈ సంవత్సరం ఓ చారిత్రక చిత్రం తెరకెక్కనుందన్నమాట. ప్రస్తుతం అనుష్క...మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న కలేజా లోనూ, క్రిష్ దర్శకత్వంలో వస్తున్న వేదం లోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu