»   »  తాప్సీ మరీ ఓవర్ చేస్తోంది

తాప్సీ మరీ ఓవర్ చేస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తాము నటించే సినిమా ప్రమోషన్ కోసం హీరో,హీరోయిన్స్ కాస్త ఎక్కువగానే మాట్లాడుతూంటారు. అయితే ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న తాప్సి తనది విచిత్రమైన పరిస్థితి అని చెప్పుకొస్తోంది. ఆమెకి దెయ్యమంటే చాలా భయమట. ఎవరికి మాత్రం భయముండదు కానీ తాప్సికి అయితే ఆ మాటెత్తితే చాలు... ఒంట్లో వణుకు మొదలవుతుందట. ఆమె ప్రస్తుతం దెయ్యం నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తోంది. నటించడం వరకు ఫర్వాలేదు కానీ సినిమా మాత్రం అస్సలు చూడను అని చెబుతోంది.

ఆ మేరకు చిత్ర దర్శకనిర్మాతల నుంచి అనుమతి కూడా తీసుకొందట. తాప్సి నటిస్తున్న ఆ చిత్రం 'ముని 3'. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. ఇది విన్నవారు సినిమా ప్రమోషన్ కోసం తాప్సీ మరీ అతి చేస్తోందని అంటున్నారు.

Hot Taapsi fears about ghost

తాప్సీ మాట్లాడుతూ ''విపరీత ప్రవర్తనతో సాగే పాత్రలంటే నాకు అస్సలు నచ్చదు. ఆ నేపథ్యంలో సాగే సినిమాలకి దాదాపు దూరంగా ఉంటా. తొలుత 'ముని3'లో కూడా నటించనని చెప్పా. కానీ అందులో పాత్ర మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వదులుకోకూడని పాత్ర అనిపించింది. ఇందులో నటించడం ఒక చక్కటి అనుభవం'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె హిందీలో అక్షయ్‌కుమార్‌తో కలిసి 'బేబి'లో నటిస్తోంది.

'ఝుమ్మందినాదం'తో వెండితెరకు పరిచయమైన తాప్సి తొలి నుంచి గ్లామర్‌ పాత్రలే పోషిస్తూ వచ్చింది. మధ్యలో 'గుండెల్లో గోదారి' వంటి నటనా ప్రాధన్యమున్న పాత్రలు కూడా చేసింది. ఈ సమయంలో సరైన విజయాలు అందుకోలేకపోయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. మీ తోటి హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మీరేంటి వెనుకబడిపోయారు అని ఎవరన్నా అంటే ఇలా సమాధానమిస్తోంది.

''నాకు మంచి పాత్రలు కావాలి. ఆ పాత్రలను తల్చుకుంటే తాప్సి గుర్తుకు రావాలి. ఏదో సినిమాలు చేసేశాం, నాలుగు రాళ్లు వెనకేసుకున్నాం అనే పద్ధతి కాదు నాది'' అంటూ గట్టిగానే చెప్పేది. తాప్సి ప్రస్తుతం 'ముని3: గంగ', తమిళంలో 'వాయ్‌ రాజా వాయ్‌'లో నటిస్తోంది. ఆమె హిందీలో చేసిన రెండో చిత్రం 'రన్నింగ్‌ షాదీ డాట్‌ కామ్‌' త్వరలో విడుదల కాబోతోంది. మరి బాలీవుడ్‌లోనూ తాప్సి ఇదే మంత్రాన్ని పఠిస్తుందా అంటున్నారు.

English summary

 Taapsi says that she is fear to see ghosts. Also, Tapsee does a ghost thriller 'Ganga'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu