»   » స్వాతంత్ర సమర యోధుడు గా ప్రభాస్!

స్వాతంత్ర సమర యోధుడు గా ప్రభాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ కెరీర్ లో వర్షం, చత్రపతి, చిత్రాలను బిగ్గెస్ట్ హిట్స్ గా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ కి అటువంటి హిట్ దొరకలేదు. బిల్లా మాత్రం కమర్షియల్ గా పర్వాలేదనిపింకుంది. ఈ నేపథ్యంలో 'ఛత్రపతి" దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళీ యమదొంగ, మగధీర లాంటి హిట్ చిత్రాల తర్వాత మళ్లీ రెబల్ స్టార్ ప్రబాస్ తోనే ఓ సెన్సేషన్ చిత్రాన్ని తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.

రామ్ చరణ్ ను శతధ్రువంశ యోధుడు కాలబైరవగా 'మగధీర" లో చూపించిన రాజమౌళి మళ్లీప్రభాస్ తోనే ఓ సెన్పేషన్ ఫిలిమ్ ను తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ను శతధ్రు వంశ యోధుడు కాలభైరవగా 'మగధీర" లో చూపించిన రాజమౌళి ఈ సారి ప్రభాస్ ను 1930-40 దశకాల నాటి స్వాతంత్ర్య సమరయోధుడుగా చూపిస్తూ ఓ పీరియాడిక్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కరుణాకరణ్ దర్శకత్వంలో 'ఛత్రపతి" ప్రసాద్ నిర్మిస్తున్న 'డార్లింగ్" చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి కూడా ప్రస్తుతం బయటి బ్యానర్ లో సునీల్ హీరోగా నటిస్తున్న 'మర్యాద రామన్న" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ చిత్రం 2011 ప్రథమార్థంలో ప్రారంభమై ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu