»   »  టెన్షన్ కంటిన్యూ: పవన్ ఎవరిని ఓకే చేస్తారో?

టెన్షన్ కంటిన్యూ: పవన్ ఎవరిని ఓకే చేస్తారో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్నారంటే ఆయన ప్రతీ విషయంలోనూ తన దైన ముద్ర ఉండాలని తపిస్తూంటారు. అందుకు తగినట్లే ప్రతీ విభాగంలోనూ ఆయన ఫైనలైజ్ చేసిన వారికే అవకాసం లభిస్తూంటుంటుంది. అందుకోసం నిరంతర శ్రమ చేస్తూంటారు. ప్రస్తుతం అలాంటిదే ఆయన తాజా చిత్రం సర్దార్ కి చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంకు హీరోయిన్ ని ఇప్పటివరకూ ఫైనల్ చేయలేదు. అందుకోసం టీమ్ నిరంతరం వర్కవుట్ చేస్తోందని చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దాంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, సమంత... ఇలా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నా ఎవరనేది ఇంకా తెలలేదు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యీనిట్ ఇంకాధ్రువీకరించలేదు. మరోవైపు ముంబయికి చెందిన కొంతమంది అమ్మాయిలనూ హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ చూసి, వీటిలో బెస్ట్ ఎవరు అనేది పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుని ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Hunt for Pawan Kalyan's heroine still on

ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌ నిర్మాత. చిత్రానికి 'సర్దార్‌' అనే పేరు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రోజు నుంచి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘ విరామం తరవాత కెమెరా ముందుకు రాబోతున్నారు.

'గోపాల గోపాల' తరవాత ఆయన ఇప్పుడే సినిమా సెట్లోకి అడుగుపెడుతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఏకధాటిగా షూటింగ్‌ జరగబోతోంది. పవన్‌, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన.

సర్దార్ విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'సర్దార్' కోసం ఓ నూతన నటుడ్ని విలన్ గా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'సర్దార్'తో విలన్ గా అరంగేట్రం చేయబోతున్నాడు.

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల మహారాష్ట్రలో తొలి షెడ్యూలు పూర్తయింది. ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలెడతారు.

English summary
Bobby is directing Pawan's Sardar and Sharath Marar is producing it. The movie's latest schedule will begin from today and Pawan will join sets in this schedule. The heroine hunt for the film is still on with Anisha Ambrose given an exit from the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu