For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాద్‌షా' ఎఫెక్ట్: పోలీసులకు హై ప్రెజర్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొంది విడుదలకు దగ్గరవుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం ఇప్పటికే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని సిటీలో సునామీలాగ టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపధ్యంలో బెనిఫిట్ షోలు, తెల్లవారు ఝామున మొదలయ్యే షో లకు డిమాండ్ ఏర్పడింది. దాంతో థియోటర్ ఓనర్స్ క్రౌడ్స్ ని కంట్రోల్ చేయటానికి పోలీస్ ప్రొటక్షన్ అడుగుతున్నారు. అన్ని థియోటర్స్ వద్ద అంతమందిని ప్రొటక్షన్ కి పంపాలంటే ఇబ్బందే అంటున్నారు. అయితే పోలీస్ లు సహకారం లేకుండా విడుదల రోజు మ్యానేజ్ చేయటం చాలా కష్టం. దీన్ని మ్యానేజ్ చేయటానికి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందని చెప్తున్నారు.

  ఇక ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.

  ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.

  ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

  English summary
  NTR's Baadshah tickets are selling like hot cakes in the advance booking.Hyderabad city police are under severe pressure from all sides to give permission for the midnight and early morning shows. But they are pulling back in the possibility of security lapses due to huge crowds at the theaters. With this kind of environment at all most all centers, the first day and first week records should be broken very easily.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X