»   » నందమూరి బాలకృష్ణ చిత్రంలో నాగబాబు కీలకమైన పాత్ర

నందమూరి బాలకృష్ణ చిత్రంలో నాగబాబు కీలకమైన పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి సోదరుడు నాగబాబు తాజాగా బాలకృష్ణ చిత్రం రామరాజ్యంకు కమిటయ్యారని తెలుస్తోంది. బాపు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగబాబు ని ఆంజనేయుడు పాత్రకు తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్దావిస్తే..ప్రస్తుతానికి ఈ విషయమై టాక్స్ జరుగుతున్నాయని, అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదని అన్నారు. అలాగే తనకు ఆంజనేయ స్వామి అంటే ప్రత్యేకమైన భక్తి అని అన్నారు.అలాగే తన అన్న,అమ్మ పేర్లు కూడా ఆంజనేయ స్వామికి చెందినవే కావటం కూడా ఆయనపై ప్రత్యేక భక్తికి కారణమన్నారు. అలాగే తాను చిన్నప్పుడు బాల హనుమాన్ లా ఫీలయ్యేవాడనని, తన చిననాటి స్నేహితుల వద్ద ఆంజనేయుని పాత్ర వేసి చూపేవాడినని, అందుకే ఇప్పుడు ఈ పాత్ర వెతుక్కుంటూ వచ్చిందని భావిస్తున్నానని అన్నారు. బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో సీతగా నయనతార కనిపించనుంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu