»   » జూ ఎన్టీఆర్ ప్రవర్తన నచ్చలేదు: ది గ్రేట్ సీనియర్ ప్రొడ్యూసర్...!?

జూ ఎన్టీఆర్ ప్రవర్తన నచ్చలేదు: ది గ్రేట్ సీనియర్ ప్రొడ్యూసర్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీయార్ నటించిన పాతాళభైరవి, రాముడు భీముడు కళా ఖండాలను ఈ జనరేషన్ లో రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినా ధైర్యం చేసి ముందుకొచ్చే నిర్మాతలే లేరు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ రామానాయుడు మాత్రం రెండింటినీ ఈ జనరేషన్ సినీ ప్రియుల కోసం మళ్లీ రీమేక్ చేస్తానంటూ ఖర్చుకు వెనుకాడకుండా జూ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు.

'ఈ రెండు సినిమాల విషయమై జూ ఎన్టీఆర్ ని సంప్రదించాను, చేద్దాం తాతయ్యా అంటాడు తప్పితే ఎప్పుడు కాల్షిట్లు ఇస్తాడు చెప్పడు. ఏదైనా ఫంక్షన్లో కనబడితే నవ్వి తప్పించుకుంటాడు కానీ ఎప్పుడు మొదలెడదాం అంటే సమాధానం ఉండదు. ఆయన రెడీ అంటే నేను ఎప్పుడో రెడీ" అంటూ ఓ కార్యక్రమంలో రామానాయుడు జూ ఎన్టీఆర్ ప్రవర్తన పట్ల చిరాకు ప్రదర్శించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu