»   » I ఎఫెక్టు:మహేష్ హీరోయిన్ ని తీసేసి అమీ జాక్సన్ తో...

I ఎఫెక్టు:మహేష్ హీరోయిన్ ని తీసేసి అమీ జాక్సన్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఐ సినిమా హిట్టా...యావరేజా మరొకటా అనేది ప్రక్కన పెడితే ఆ చిత్రంలో చేసిన హీరోయిన్ అమీ జాక్సన్ కు మాత్రం తెగ అవకాశాలు వస్తున్నాయి. ఆచి తూచి అడుగులు వేస్తున్న ఆమె తాజాగా అక్షయ్ కుమార్ చిత్రం 'సింగ్ ఈజ్ బ్లింగ్' లో హీరోయిన్ గా బుక్కైందని సమాచారం. మొదట ఈ చిత్రంలో మహేష్ సరసన 1 నేనొక్కిడినే చిత్రంలో హీరోయిన్ గా చేసిన కీర్తి సనన్ ని అనుకోవటం జరిగింది. అయితే ప్రాజెక్టు కొద్దిగా లేటవటం, ఈ లోగా ఐ రిలీజై అందరి దృష్టినీ అమీ జాక్సన్ ఆకర్షించటంతో ఆమెను తీసుకోవాలని అక్షయ్ కుమార్ సూచించారని సమాచారం. ప్రభుదేవా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమీ జాక్సన్ మాట్లాడుతూ....చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేనాటికి నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా ఓ తెగ కంగారు పడిపోయేదాన్ని. గాసిప్పులు సాధారణం అని తెలిసినా తట్టుకోలేకపోయేదాన్ని. మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ధైర్యం వచ్చేసింది అంటోంది అమీ జాక్సన్‌. ఇటీవల ఈమె నటించిన 'ఐ' చిత్రం విడుదలైంది. అమీ కెరీర్‌ తొలినాళ్లలో గాసిప్పులంటే బాగా భయపడేదట.

I Effect: Amy Jackson replaces Mahesh's Heroine!

అమీ మాట్లాడుతూ ''19 ఏళ్ల వయసులో ఉండగా 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాను. అప్పుడు నాకు పరిశ్రమలో తెలిసివాళ్లు అంతగా లేరు. నాపై మీడియాలో ఏ చిన్న పుకారు వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాను'' అని చెప్పింది.

బాలీవుడ్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ''గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలనే ఉద్దేశంతోనే 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను. ఆ సినిమా తమిళ మాతృక సూపర్‌ హిట్‌. దక్షిణాది సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యుంటే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు మరింత ఎక్కువగా వచ్చుండేవేమో. ఏదైనా చివరకు భారతీయ సినిమాలో నటించడమే కదా''అని చెప్పింది అమీ.

అమీ జాక్సన్ మాట్లాడుతూ... 'శివతాండవం'లో తొలిసారి విక్రమ్‌ సరసన నటించే అవకాశం. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన అవకాశం వచ్చింది. నేను అది వరకు చేసినవి చాలా సీరియస్‌ పాత్రలు. ఇందులో కొంత కామెడీ ఉంది, జాలీగా అనిపిస్తుంది. ఒప్పుకున్నాను. అప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. తెలుగు రాకపోయినా.. హైదరాబాద్‌ చాలా నచ్చేసింది. ఆ చిత్రం ముగుస్తుండగానే శంకర్‌ నుంచి 'ఐ' పిలుపొచ్చింది.

I Effect: Amy Jackson replaces Mahesh's Heroine!

ఆరోజు ఎగిరి గంతేసినంత పనిచేశా. ఒకే చిత్రంలో నలుగురు గొప్ప కళాకారులు.. శంకర్‌, పీసీ శ్రీరామ్‌, ఏఆర్‌ రెహ్మాన్‌, విక్రమ్‌తో పనిచేసే అవకాశం వచ్చిందంటే.. ఐ యామ్‌ లక్కీ కదా! మామూలుగా శంకర్‌ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా పనుండదని అంటారు. కానీ ఇది వేరు. ఇదో లవ్‌ థ్రిల్లర్‌ అనొచ్చు. నా జీవితంలో మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే ఇదొక్కటే ఒకెత్తు. ఈ ఒక్క చిత్రానికే రెండేళ్లు తీసుకున్నాను. ఆ కష్టం వృథా పోలేదు. ఆడియో వేడుకలో శంకర్‌, విక్రమ్‌ ప్రశంసలు నా జీవితంలో మరవలేనివి. ఆ మాటలకు ఎంత ఐసైపోయానో చెప్పలేను అన్నారు.

ఇక భారత్‌కి వచ్చాక ఇక్కడి సంస్కృతినీ, భాషనీ అర్థం చేసుకోవడం కష్టమే అయినా పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు. నేను తీవ్రంగా బాధపడ్డ అంశాలు వేరే ఉన్నాయి. నా రెండో చిత్రం నుంచే ఒక్కసారిగా నన్ను పుకార్లు చుట్టుముట్టాయి. మొదట్లో చాలా బాధపడ్డా. పట్టించుకోవడం మానేశా. నేను కేవలం మోడల్‌నయితే ఇలాంటివి వచ్చి ఉండకపోవచ్చుగానీ... సినిమా అన్నాక తప్పదు కదా అని సర్ది చెప్పుకున్నా అన్నారామె.

అలాగే...కానీ గాసిప్స్‌కంటే నా మనసుని కలచివేసిన అంశం మరొకటుంది. 'ఈ తెల్లమ్మాయి మనదేశంలో పని చేయడమేమిటీ.. మనకెవరూ లేరా.. ఈ దేశం గొడ్డుబోయిందా!' అన్న గగ్గోలు మొదలైంది. ఈ దేశాన్ని రెండో పుట్టిల్లుగా భావిస్తున్న నాకవి చెంపపెట్టులా తగిలాయి. చాలా బాధపడ్డా. కానీ అవి చేసేవాళ్లు కొందరేననీ... ఇక్కడి సామాన్యులు దేశం, మతం, జాతులకతీతంగా అందర్నీ అక్కున చేర్చుకోగలరని అర్థమైంది. భారత్‌ గొప్పతనం అదే! అందుకే ఈ దేశాన్ని నేనింతగా ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు.

English summary
Shankar's 'I' hit the screens and Amy Jackson has grabbed the attention of even Bollywood Makers. Makers of 'Singh Is Bling' replaced Kriti Sanon with Amy Jackson and the shoot begins from April this year.
Please Wait while comments are loading...