»   » బన్నీ చేయకపోతే ఆర్య 3 నేను చేస్తానంటూ బాంబ్ పేల్చిన శిరీష్...

బన్నీ చేయకపోతే ఆర్య 3 నేను చేస్తానంటూ బాంబ్ పేల్చిన శిరీష్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఆర్య" చిత్రం అల్లు అర్జున్ కెరీర్ కు తిరుగులేని పునాది వేసిన సంగతి తెలిసిందే..'ఆర్య 2" అనేక కారణాల వల్ల ఆర్థిక విజయం సాధించలేకపోయినప్పటికీ..'ఆర్య" కంటే 'ఆర్య 2" తనకిష్టమిని అంటున్నాడు గీతా ఆర్ట్స్ వారసుడు అల్లు శిరీష్. అంతే కాదు..తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'ఆర్య 3" నిర్మించే ఆలోచన సైతం ఉందని శిరీష్ చెప్పుకొస్తున్నాడు. 'ఆర్య" చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, 'ఆర్య 2"ని ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ లో ఆదిత్యబాబు నిర్మించాడు.

'ఆర్య, ఆర్య 2" చిత్రాలు అతనిలోని కొత్త నటుడ్ని ఆవిష్కరించాయి. ఈ రెండు చిత్రాలు తనకు చాలా ఇష్టమని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నాడు. అల్లు అర్జున్ ని ఆర్య 3 కూడా చేయమని చెప్పాలనుకుంటున్నాడట శిరీష్. ఒక వేళ బన్నీ చేయకపోతే 'ఆర్య 3"లో తనే హీరోగా నటిస్తానని అల్లు శిరీష్ పెద్ద బాంబే పేలుస్తున్నాడు...

అల్లు శిరీష్ హీరోగో రంగంలోకి దిగడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్ హ్యాండ్సమ్ గా లేకపోయినా నటుడిగా, స్టైలిష్ స్టార్, డ్యాన్స్ స్టార్ గా మంచి మార్కులు కొట్టేశాడు. శిరీష్ కూడా అందగాడు కాదు..మరి తన సోదరుడిలా తనలో మంచి నటుడు ఉన్న విషయాన్ని శిరీష్ నిరూపించుకుంటాడో లేదో..వేచి చూడాల్సిందే.!

English summary
Now the latest buzz is that Allu Sirish is likely to make his debut in Tamil as a hero in Tamil remake of Tollywood’s hit film "100% Love". Allu Arjun and Ram Charan turned out to be successful heroes and youngest Allu Sirish is also planning to test his luck as a hero. I want him(allu arjun) to do Arya 3.. If he doesn't I will do off....twitted Allu Sirish recently..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu