»   » అందాన్ని అందరీకి పంచాలని ఆరటపడుతున్నా ఇలియానా!

అందాన్ని అందరీకి పంచాలని ఆరటపడుతున్నా ఇలియానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో ప్రవేశించాలని తాను చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడ ఏదో రకంగా బెడిసి కొడుతుండడంతో సదరు ప్రయత్నాలకు స్వస్తి పలికి నేరుగా బాలీవుడ్ లోకి ప్రవేశించాలని ఇలియానా నిర్ణయించుకున్నదంట. బాలీవుడ్ లోకి ప్రవేశించాలనే ఆసక్తితో పాటు ఆ భాషలో రాణించగల శక్తి కూడా తన సొగసులకు, అభినయానికి ఉందని ఇలియానా చాలా గట్టిగా భావిస్తున్నదంట. ప్రస్తుతం తెలుగులో 'శక్తి" లో చిత్రంలో నటిస్తున్న ఈ సొగసరి..ఈ మేరకు బాలీవుడ్ లోని క్యాస్టింగ్ డైరక్టర్స్ కు స్పష్టమైన సంకేతాలివ్వడమే కాకుండా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ వంటి హీరోలతో డేటింగ్ చేసే అవకాశాల్ని సైతం పరిశీలించాల్సిందిగా కూడా పరోక్షంగా విజ్ఝప్తి చేస్తున్నదంట. తన అందాలను కేవలం తెలుగు చిత్రసీమకు మాత్రమే పరిమితం చేయాల్సొస్తుండడం తనకు సుతారామూ ఇష్టం ఉండడం లేదని కూడా ఇలియానా తన సన్నిహితుల వద్ద వాపోతున్నదంట!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu