twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ స్టార్ ఇలియానాకు బుద్ది చెప్పటానికి అశ్వనీదత్ ప్రయత్నం

    By Srikanya
    |

    ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి చాలా మందికి కష్టాలు తెచ్చిపడుతోంది. ఆ సినిమా ప్లాప్ అని తమ ఛానెల్ లో చెప్పినందుకు ఎన్ టీవి పై బహిష్కరణ వేటు వేసారు. ఆ చిత్రానికి సంభందించి లేటెస్ట్ ప్రోమోలు, ఇంటర్వూలు,ట్రైలర్స్ ,ప్రెస్ మీట్స్ ఏవీ అందకుండా బ్యాన్ పెట్టారు.అదే విధంగా ఆ సినిమాలో నటించిన ఇలియానా పై వేటు వేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆమె ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వూలో తాను శక్తి చిత్రం చూసి చాలా నిరాశ చెందానని, తనకో కథ చెప్పి తెరపై మరొకటి చిత్రీకరించారని విమర్శిస్తూ మాట్లాడింది. అంతేగాక తన ప్యాన్స్ ని ఆ చిత్రం చూడమని చెప్పలేనని నిర్మొహమాటంగా చెప్పింది.

    అంతేగాక తాను ఈ ప్లాప్ చిత్రం ప్రమోషన్ లో పాల్గొనని తేల్చేసింది. ఇక అదే రోజున అశ్వనీదత్ గ్రాండ్ గా ఈ చిత్రానికి సంభందించి ప్రకటనలు గుప్పించారు. తమ చిత్రం విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేస్తోందని, కొత్త రికార్డులు క్రియోట్ చేస్తోందని అన్నారు. దాంతో అదే రోజు ఇలియానా ఇంటర్వూ చూసిన వారికి అవన్నీ దొంగ లెక్కలని, కావాలని సినిమాని హైప్ చేస్తున్నారని అర్దమయింది. దాంతో ఇంకా కొద్దో గొప్పో వెళ్ధామనుకున్నవారు కూడా ఆగిపోయే సిట్యువేషన్ వచ్చింది. ఇది నిర్మాతగా అశ్వనీదత్ కీ, హీరోగా ఎన్టీఆర్ కి మింగుడు పడని విషయం. కోటి రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని ఇలా భాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం వారికి నచ్చలేదు. దాంతో మండి పడుతున్న అశ్వనీదత్ తన తోటి పెద్ద నిర్మాతలతో చర్చించి ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టి ఆమెకు బుద్ది చెప్పే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. వారు కూడా ఆ మేరకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    Taking one crore rupees as remuneration, Ileana did not even participate in the promo activities and instead she did negative publicity. This is reportedly giving Ashwini Dutt the ground to ban Ileana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X