»   » రెమ్యునేషన్ విషయంలో ఇలియానా కొత్త రికార్డు

రెమ్యునేషన్ విషయంలో ఇలియానా కొత్త రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా ఇప్పుడు తెలుగులో హైయిస్ట్ రెమ్యునేటెడ్ హీరోయిన్ గా మరో రికార్డుని నెలకొల్పింది. ఇప్పుడు ఆమె రెమ్యునేషన్ కోటిన్నర నుంచి కోటి డబ్బై ఐదు లక్షలకు పెరిగింది. త్రీ ఇడియట్స్ సినిమాకుగాను ఆమె కోటిన్నర ఛార్జ్ చేయటమే రికార్డుగా చెప్పుకున్నారు. అయితే ఈ రేటు ఆమె కొత్తగా ఒప్పుకున్న చిత్రానికి అని తెలుస్తోంది. ఇక ఇలియానా తో కాజల్,అనూష్క సినిమాల విషయంలో పోటి పడగలుగుతున్నా రెమ్యునేషన్ విషయంలో ఆమే టాప్ గా ఉంది. ఇదో స్టేటస్ సింబల్ గా అభివర్ణిస్తున్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఆమె ఎంత రేటు పెంచినా అంతకు తగినట్లుగా ఆమె ఇంటిచుట్టూ డేట్స్ కోసం తిరిగే నిర్మాతల సంఖ్య పెరిగిపోతోంది.

ప్రస్తుతం ఇలియానా నటించిన శక్తి విడుదలకు సిద్దంగా ఉంది. ఆ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే రెండు కోట్లు ఆమె డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ప్రస్తుతం ఇలియానా నటించిన నేనూ...నా రాక్షసి చిత్రం కూడా త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ఆమె శంకర్ దర్శకత్వంలో త్రీ ఇడియట్స్ తెలుగు,తమిళ వెర్షన్స్ లో నటిస్తోంది. అలాగే పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా కమిటైంది.

English summary
Ileana sets new record by charging more than Rs 1.75 Crores for a new film. No South Indian heroine has been given such amount for a film so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu