»   »  ఆఖరికి: అఖిల్ కోసం...ఇలియానా కమిటైంది

ఆఖరికి: అఖిల్ కోసం...ఇలియానా కమిటైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత ఇలియానా ఇక్కడ శీతకన్ను వేసిందనే చెప్పాలి. పూర్తిగా అక్కడే కాన్సర్టేట్ చేస్తూ ఇక్కడ సినిమాలు కమిటవ్వటం లేదు. అయితే ఆమెను ఓ ఐటం సాంగ్ కు ఒప్పించిన ఘనత మాత్రం నితిన్, అఖిల్ లదే అంటున్నారు. నితిన్ కు గతంలో రెచ్చిపో సమయంలో ఉన్న పరిచయంతో ఇలియానా ని ఎప్రోచ్ అయ్యి...ఐటం సాంగ్ చేయమని అడగటం జరిగింది. దానికి తోడు వినాయిక్ దర్సకత్వం అఖిల్ హీరో కావటంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మొదట రాశీ ఖన్నాని ఈ పాట కోసం అడిగారు. అయితే ఆమె నో చెప్పేసిందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం విశేషాలకు వస్తే...

అక్కినేని వంశం నుంచి వస్తున్న కొత్త హీరో అఖిల్.. తొలి సినిమాతో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడట ఈ చిన్నోడు. ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తోనూ దాన్ని షేర్ చేసుకుంటున్నాడు అఖిల్. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమా షూటింగ్ నిమిత్తం స్పెయిన్ వెళ్లిన అఖిల్... ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నాడట.

అయితే అబ్బాయి అంతకు ముందే స్పెయిన్ కు వెళ్లినా.. ఈసారి తన సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడికి వెళ్లడంపై తెగ సంబరపడిపోతున్నాడట. ఇది తన సినిమా తొలి విదేశీ షెడ్యూల్ కావడం అబ్బాయికి భలే కిక్ ఇస్తోందట. అందులోనూ ఇంత మంచి టీమ్ తో కలసి పని చేస్తుండటంపై అఖిల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అక్కినేని చిన్నోడు.

అఖిల్ సరసన సాయేష సైగల్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందించగా కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ పతాకంపై తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలసి యువహీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులలో అంచనాలు బాగున్నాయి.

Ileana's sizzling item no in Akil's film

వివి వినాయిక్ మాట్లాడుతూ...''నాగార్జునగారు నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా. 'మనం'లో అఖిల్‌ను చూడగానే అందరిలా నేనూ షాక్‌కు గురయ్యా. అంత బాగా నచ్చేశాడు. ఎంత నచ్చాడో ఈ చిత్రంలో చూపిస్తాను.వంద శాతం కష్టపడే సాంకేతిక బృందం కుదిరింది. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా అఖిల్‌ను తెరపై చూపిస్తానని మాటిస్తున్నాను''అన్నారు వి.వి.వినాయక్‌.

నితిన్‌ మాట్లాడుతూ... ''ప్రతిష్ఠాత్మకమైన ఈ సినిమాకు నేను నిర్మాత కావడం ఆనందంగా ఉంది. నాగార్జునగారు మాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నెరవేర్చుతాం. ఆయన చేసిన ప్రేమకథా చిత్రాలు 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా'.. మాస్‌ సినిమాలు 'శివ', 'మాస్‌' కలిపితే ఎలా ఉంటుందో అఖిల్‌ చేసే ఈ సినిమా అలా ఉంటుంది''అన్నారు.

అఖిల్‌ మాట్లాడుతూ.... ''ఈ సమయంలో తాతగారు ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఆయన అభిమానుల్లోనే దేవుడిని చూసుకొనేవారు. అభిమానులు ఎంతో ఇస్తారు. మేం తిరిగి వాళ్లకు హిట్‌ సినిమా తప్ప ఏం ఇవ్వగలం. ఎలాగైనా హిట్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకొన్నా. దాని గురించే ఆలోచిస్తూ నాన్నను అడిగేవాణ్ని. అప్పుడు చీకట్లో ఉన్న నాకు ఒక సెర్చ్‌లైట్‌లా కనిపించారు వి.వి.వినాయక్‌గారు. ఇలాంటి సినిమాకు వినాయక్‌గారే దర్శకత్వం వహించాలని నాకనిపించింది.

అలాగే...కేవలం అభిమానుల కోసమే తొలి సినిమా చేయాలని నితిన్‌ చెబుతూ ఉండేవాడు. ఆయన నా సినిమాకు నిర్మాత కావడం ఆనందాన్నిచ్చింది. ఇందులో యాక్షన్‌, డ్యాన్స్‌ అన్నీ కొత్తగా ఉంటాయి. మూడు నాలుగేళ్లుగా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. అందరికీ నచ్చేలా తెరపై కనిపిస్తా. ఈ సినిమాకు తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ కలసి సంగీతం అందిస్తారు''అన్నారు.

నేను ఈ స్థాయికి చేరుకోవటానికి అమ్మనాన్నలే ముఖ్య కారణం. అన్నయ్య నాగచైతన్య ఇంత ఎమోషనల్ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి ఓ పెద్ద మల్టీస్టారర్ సినిమా చేస్తాం అన్నారు అఖిల్.

శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అఖిల్ కు తండ్రిగా నటిస్తుండగా... సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
Ileana has been roped in to perform an item number in an upcoming movie of Akhil Akkineni. The movie is directed by V. V. Vinayak and Sayesha Saigal is paired opposite to Akhil. The movie is produced under the banner of Sresth Movies by Nithin.
Please Wait while comments are loading...