»   » హైదరాబాద్లో ఆస్తులు అమ్మకానికి పెట్టిన ఇలియానా

హైదరాబాద్లో ఆస్తులు అమ్మకానికి పెట్టిన ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ileana
హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు తెలుగుతో పాటు సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఇలియానా...బాలీవుడ్ అవకాశాలు రావడంతో టాలీవుడ్‌కు టాటా చెప్పి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న ఆసక్తికర సమాచారం ఏమిటంటే అమ్మడు ఇపుడు హైదరాబాద్‌ నుండి పూర్తికగా మకాం ఎత్తేయడానికి ప్లాన్ చేసుకుంటోందట.

హైదరాబాద్‌లోని ల్యాంకో టవర్స్‌లో రూ. 1.25 కోట్లు పెట్టి అప్పట్లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను ఇలియానా అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి అమ్మడు ఇక సౌత్ సినిమా వైపు చూడబోదని స్పష్టం అవుతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సౌత్‌లో కోటిగా పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న ఇలియానా......డబ్బు బాగానే పోగేసుకుంది.

తెలుగు మూవీ 'దేవదాసు' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఇలియానా తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. ఆ వెంటనే మహేష్ బాబుతో 'పోకిరి' సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలా మొదలైన ఇలియానా ప్రస్తానం సౌతిండియాలో స్టార్ హరోయిన్ రేంజికి చేరింది.

తెలుగులో చివరి సారిగా 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించిన ఇలియనా తర్వాత 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంనే విజయం సొంతం చేసుకున్న ఇలియానా.....అక్కడ వరుస అవకాశాలు దక్కించుంది. ఈ క్రమంలో సౌత్ నుండి జెండే ఎత్తేసేందుకు ప్లాన్ చేసుకుంది. అమ్మ ప్రస్తుతం ముంబై స్థిర నివాసం ఏర్పరుచుకన్న ఇలియానా అక్కడ 3.5 కోట్లో విల్లా కొనుగోలు చేసిందట.

English summary

 Ileana has bought a flat in Lanco elegant Towers in Manikonda some time, to the tune of Rs . 1.25 cores and now she is looking to either dispose of the property or let it out if she finds a suitable tenant since she has no plans to return to Tollywood in the near future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu