twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాలో వైయస్ జగన్ పై సెటైర్స్ !?

    By Srikanya
    |

    క్రేజ్ లో ఉన్న పొలిటీషన్స్ పై సెటైర్స్ వేస్తే జనం గబుక్కున కనెక్టు అయిపోతారు. టైం బాగుంటే కాంట్రావర్శి జరిగి కలెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడదే రూటులో ఓ చిత్రం ప్రయాణం పెట్టుకుందని తెలుస్తోంది. పొలిటికల్‌ సెటైర్‌ కథాంశంతో తమిళ,తెలుగు భాషల్లో 'శకుని' అనే చిత్రాన్ని రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో కార్తి ఈ చిత్రంలో హీరో కాగా ప్రణీత హీరోయిన్ గా చేస్తోంది. ఎన్‌.శంకర్‌దయాళ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైయస్ జగన్ పై సెటైర్స్ ఉండబోతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ' చిత్రాలను తీసిన స్టూడియో గ్రీన్‌ సంస్థ తాజాగా కార్తితోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆ చిత్రాల కోవలోనే ఈ చిత్రాన్ని కూడా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నామని, రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తామని నిర్మాత జ్ఞానవేల్‌రాజా తెలిపారు. కార్తి మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో చాలా గెటప్స్‌లో కనిపిస్తాను. అనేక మలుపులతో చిత్రం ఆసక్తిని కలిగిస్తుంది. మంచి ప్రతిభాపాటవాలు ఉన్న వ్యక్తి దర్శకుడు. చిత్రాన్ని అతనెంతో బాగా తీర్చిదిద్దారు.

    టైటిల్‌ మొదలుకుని అన్ని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి' అని అన్నారు. దర్శకుడు శంకర్‌ దయాళ్‌ మాట్లాడుతూ, 'బాల్యదశలో ఉన్న ఓ పిల్లవాడు యవ్వనం వరకు సాగే ప్రయాణం ఎలా ఉంటుందో ఈ చిత్రంలోని కథానాయకుడు రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమం ఆ విధంగా ఉంటుంది. రాజకీయంగా అతనిని కలిసే ప్రతివ్యక్తి మలుపుకి కారణమవుతాడు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వం ఈ చిత్రంలోని కథానాయకుడిది' అని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్‌, రోజా, సంతానం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: సాహితి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌, ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, బాబా భాస్కర్‌, సహ నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌ దయాళ్‌.

    English summary
    Shakuni is said to be a political satire and is made as a bilingual simultaneously in Telugu and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X