»   » బాహుబలి-2 ప్రీమియర్ షో ? నిజమా, పుకారా?? మరీ ఫొటో!?

బాహుబలి-2 ప్రీమియర్ షో ? నిజమా, పుకారా?? మరీ ఫొటో!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండేళ్ళ నిరీక్షణ ఇంకో రెండురోజులు మాత్రమే గడువు. టాలీవుడ్ నుంచి ఎగసిన తెలుగోడి విజువల్ అద్బుతం బాహుబలి: ది కంక్లూజన్ కొసం ఎదురు చూస్తూనే ఉన్నారు జనం, కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్నది ఇప్పుడుఇ చాలా చిన్న ప్రశ్న, అసలు ఈ రెండో పార్ట్ మరెంత అద్బుతంగా ఉందబోతుందన్నదే అందరి ఆసక్తీ.

యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు

యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు

వేల రూపాయలు పెట్టి మరీ టికెట్లు కొంటున్నారు. ఇప్పటికే నేషనల్ మీడియాలో బాహుబలి టీం ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తుండగా.. మరి కొద్ది రోజుల్లో దుబాయికి కూడా వెళ్లనుంది చిత్ర బృదం. ఇదిలా ఉండగా సినిమాపై ఓ సినీ విశ్లేషకుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, యూఏఈ, యూకే, ఇండియా సినీ విశ్లేషకుడు అయిన ఉమైర్ సంధు.. ఏప్రిల్ 17న చేసిన ట్వీట్ బాహుబలి-2 సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

 ఉమైర్ సందు

ఉమైర్ సందు

సినిమా ఫలితంపై సినీవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ఉమైర్ సందు ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు, ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెబుతున్నారు. ఉమైర్ సంధు చెప్పిన మాటలే కనుక నిజమైతే.. బాహుబలి గురించి, తెలుగోడి సత్తా గురించి ప్రపంచం మాట్లాడుకోవడం ఖాయం అన్న మాటే వినిపిస్తోంది.

వందరెట్లు బాగుంటుందని

వందరెట్లు బాగుంటుందని

బాహుబలి-1 కంటే బాహుబలి-2 సినిమా వందరెట్లు బాగుంటుందని ఉమైర్ సందు తేల్చిచెప్పారు. సినిమా ఫలితంపై సినీవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు, ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని తెలిపారు. ఉమైర్ సంధు చెప్పిన మాటలు నిజం కావాలని..తెలుగు సినిమా అంటే ఏంటో మరోసారి ప్రపంచ వ్యపథంగా తెలియాలి అంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

గురువారం సాయంత్రం

గురువారం సాయంత్రం

బాహుబలి-2 గురించి మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారూ.. అప్పుడే బాహుబలి-2 ప్రీమియర్లు మొదలైపోయాయా..? అని షాకవుతున్నారు. వాస్తవానికి గురువారం సాయంత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్లతో బాహుబలి-2 ప్రభంజనానికి తెర లేవాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం నుంచి

శుక్రవారం ఉదయం నుంచి

భారత్‌లో శుక్రవారం ఉదయం నుంచి ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. కానీ, సినిమాలోని కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్‌లో ప్రత్యక్షమవడంతో అప్పుడే సినిమా ప్రీమియర్ పడిపోయిందా అని బాహుబలి అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే.. పలువురు మాత్రం సెన్సార్ సభ్యులకు షో వేసినప్పుడు తీసిన ఫొటో అయి ఉండొచ్చన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు.

English summary
Some photos are Roming in Social meadia by saing those are frome Bahubali 2 premior show
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu