SSMB28 కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్.. సెంటిమెంట్ పక్కన పెట్టి... 'అతడు'ని వాడేస్తూ?

త్రివిక్రమ్ .. మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షర వేగంగా జరుగుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలలో అతడు సినిమా సూపర్ హిట్ గా నిలవగా ఖలేజా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కానున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై గురించి తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

 మంచి ఫామ్‌లో మహేష్ బాబు

మంచి ఫామ్‌లో మహేష్ బాబు

మహేష్ బాబు వరుస హిట్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్పైడర్ భారీ డిజాస్టర్ అందుకున్న తరువాత ఆయన దాదాపు మూడు సినిమాలు చేయగా మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ రాజమౌళితో సినిమా అంటే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో ఆయన ఈ మధ్యలో త్రివిక్రమ్తో సినిమా ఖరారు చేసుకున్నాడు.

అదే జోరులో త్రివిక్రమ్

అదే జోరులో త్రివిక్రమ్

ఇక అజ్ఞాతవాసి ఫ్లాప్ అందుకున్న తర్వాత త్రివిక్రమ్ కూడా రెండు సూపర్ హిట్ సినిమాలు అందుకున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టగా గత ఏడాది కూడా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠ పురం సినిమాతో మరో బంపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆయన ముందుగా ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజమౌళితో సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యేట్టు కనిపించని నేపథ్యంలో ఇంకా ఎక్కువ రోజులు వెయిట్ చేయలేక త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా ఖరారు చేసుకున్నాడు. మరో పక్క ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో సినిమా ఖరారు చేసుకున్నాడు.

 పరిశీలనలో ఆసక్తికర టైటిల్

పరిశీలనలో ఆసక్తికర టైటిల్

ఇక దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి టాలీవుడ్ వర్గాల తో పాటు మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ ఒక రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు మొదలయ్యాయి. నిజానికి పార్ధు అనే పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ.

అతడును వాడేస్తున్నారా?

అతడును వాడేస్తున్నారా?

అవును నిజమే, అతడు సినిమాలో మహేష్ బాబు పేరు ఇదే. నిజానికి రాజీవ్ కనకాల పేరు పార్ధు, కానీ ట్రైన్లో పరిచయమైన వెంటనే రాజీవ్ కనకాల చనిపోవడంతో రాజీవ్ కనకాల ఐడెంటితో ఆయన ఇంటికి వెళతాడు మహేష్. అలా సినిమాలో మహేష్ పేరు పార్ధు అయిపోతుంది. అయితే ఆసక్తికరంగా ఈ సినిమా కోసం పార్ధు అనే టైటిల్ ని వాడుకోవడానికి త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియదు కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.

Recommended Video

SSMB 28 లో Mahesh Babu పాత్ర ఇదేనట | Mahesh Babu Trivikram Movie || Filmibeat Telugu
సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ

సెంటిమెంట్ పక్కన పెట్టి మరీ

నిజానికి త్రివిక్రమ్ కి సెంటిమెంట్లు కాస్త ఎక్కువే. అందుకే ఆయన తన టైటిల్స్ అ అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటాడు. అంతెందుకు ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాకు కూడా 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ మహేష్ బాబు తో సినిమాకి మాత్రం కొత్తగా పార్ధు అనే పేరు పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ పక్కనపెట్టి మరీ ఈ టైటిల్ ని ఎంచుకున్నాడు అంటే ఈ పేరు ఎంతో స్పెషల్ అని అంటున్నారు. చూడాలి ఇది ఎంత వరకు నిజం అవుతుందో ?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X