»   » సాయిధరమ్ తేజ్, కరుణాకరన్ సినిమా టైటిల్ భలేగా ఉందే!

సాయిధరమ్ తేజ్, కరుణాకరన్ సినిమా టైటిల్ భలేగా ఉందే!

Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సాయిధరమ్ తేజ్ కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో ఈ మెగా హీరో ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ పైనే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ చివరగా ఇంటెలిజెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరుణాకరన్, తేజు చిత్రానికి సంబంధించి పలు రకాల టైటిల్స్ ఆ మధ్యన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్, పవర్ స్టార్ కరుణిస్తాడా..!

తాజగా ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ చాలా బావుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా దీనిని కరుణాకరన్ తెరకెక్కించబోతున్నారు.

Interesting title for Sai Dharam Tej new movie

మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేకకథలతో మాయ చేసే కరుణాకరన్ కూడా హిట్ కోసం ఎదురుచూస్తునాడు. సాయిధరమ్ తేజ్, అనుపమ జోడి పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

English summary
Interesting title for Sai Dharam Tej new movie. Karunakaran is directing this movie. Anupama Parameswaran is female lead
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X