»   » అసలే ఫ్లాఫుల్లో ఉన్న అల్లరి నరేష్ ని కార్తి దెబ్బ కొట్టాడా? ఎంత వరకూ నిజం?

అసలే ఫ్లాఫుల్లో ఉన్న అల్లరి నరేష్ ని కార్తి దెబ్బ కొట్టాడా? ఎంత వరకూ నిజం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అసలే అల్లరి నరేష్ సినిమాలు ఆడటం అంతంత మాత్రం అయ్యిపోయింది. ఆయన కామెడీ సినిమాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. దాంతో ఆయన ట్రెండ్ ని పట్టుకుని దున్నేద్దామనుకుని హర్రర్ కామెడీ జానర్ లోకి వచ్చి సినిమా చేసారు.

అయితే ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ రీసెంట్ గా కార్తీ చేసిన కాశ్మోరా రిలీజైంది. ఈ చిత్రం కథకు, అల్లరి నరేష్ చేసిన 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' కథకు దగ్గర పోలికలు ఉన్నాయంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పై కార్తీ ..కాశ్మోరా ఎఫెక్ట్ పడుతుందా అనే సందేహాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.ఇప్పటికే రిలీజైన అల్లరి నరేష్ ట్రైలర్ ని బట్టి..ఈ సినిమాలో కూడా అల్లరి నరేష్ ...తనకు దెయ్యాలు పోగొట్టే మంత్రాలు రాకపోయినా ఓ ఇంట్లోకి చేరి అక్కడ ఆల్రెడీ ఉన్న దెయ్యాన్ని వెళ్లగొడతానని ట్రైల్స్ వేస్తూంటాడు. అయితే ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందనే కథగా జరుగుతుంది. కాశ్మోరాలో కూడా కొంచెం అటూ ఇటూగా అలాంటి కథే రన్ అవుతుంది.


Intlo Deyyam Nakem Bhayam similar to Kashmora?


అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నారు.అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

English summary
Allari Naresh's 'Intlo Deyyam Nakem Bhayam' Being directed by G Nageshwara Reddy and produced by BVSN Prasad. This horror comedy is gearing up for release on 11th November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu