AA22xA6 ప్రాజెక్ట్ తోనూ దీపికాకు షాక్.. మేకర్స్ కీలక నిర్ణయం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు వరుసగా గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్ లోని స్పిరిట్ చిత్రం నుంచి ఆమె తప్పుకుంది. అప్పటి నుంచి దీపికా పుదుకొణె తదుపరి చిత్రాల నుంచి కూడా తప్పుకుంటూ వస్తోంది. దీపికా పదుకొణె ఇప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి కల్కి 2898 ఏడీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో కల్కి 2898 ఏడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మేకర్స్ వైజయంతి మూవీస్ వారు సీక్వెల్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని మేకర్స్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇలా భారీ ప్రాజెక్ట్స్ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.

Is AA22xA6 Movie Makers think about Deepika Padukone

ఈ క్రమంలో దీపికా పదుకొణె చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ AA22xA6. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమే ఇది. ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా ఇప్పటి వరకు దీపికా పదుకొణెను మాత్రమే ప్రకటించారు మేకర్స్. అయితే దీపికా పదుకొణె వరుసగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగెటివ్ టాక్ ను కూడ గట్టుకోవడంతో ఆమె తదుపరి చిత్రం AA22XA6 ప్రాజెక్ట్ పైనా ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ విషయంలో దీపికా పదుకొణెకు ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ లో ఇప్పటికే సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కన్ఫమ్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీపికా పదుకొణెపై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న వేళ ఆమెను AA22xA6 ప్రాజెక్ట్ విషయంలో మెయిన్ లీడ్ నుంచి సైడ్ రోల్‌కు మార్చినట్టు రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ఇదే సమయంలో మృణాల్ ఠాకూర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ గట్టిగానే ప్రచారం జరుగుతోంది.

ఇక AA22xA6 ప్రాజెక్ట్ ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబోతున్నారు.కోలీవుడ్‌లోని అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం టాప్ స్టార్ కాస్ట్, హాలీవుడ్ టెక్నీషియన్లను ఎంపిక చేస్తున్నారు. లార్జర్ దన్ లైఫ్ సినిమాగా భారీ యాక్షన్, విజువల్స్ తో రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టూడియోలు లోలా వీఎఫ్ఎక్స్, ఐరన్‌హెడ్ స్టూడియో, ఫ్రాక్చర్డ్ ఎఫ్ ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐఎం టెక్నోప్రాప్స్ మరియు లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు. దీంతో చిత్రానికి రూ.800 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X