Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లరి నరేష్ ‘యాక్షన్’3డి ఆ హాలీవుడ్ చిత్రం ప్రేరణ?
హైదరాబాద్ : అల్లరి నరేష్, వైభవ్, రాజసుందరం, కిక్‌శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ఆధారంగా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఈ టాక్ రూమర్ అన్నా..కాదు ఇది నిజమే అంటున్నారు. కామెడీ చిత్రాల్లో హ్యాంగోవర్ ఘన విజయం సాధించింది. హాలీవుడ్ లో ఈ చిత్రానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి.
ఈ చిత్రం గురించి 'అల్లరి'నరేష్ మాట్లాడుతూ, 'సినిమా రంగం పట్ల అభిరుచి మాత్రమే కాదు పక్కా ప్లానింగ్ ఉన్న నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రంతో దర్శకుడు కావడం అభినందనీయం. లోగడ నిర్మాతగా అనిల్ తీసిన చిత్రాలు ఎంతోబాగా వచ్చాయంటే, వాటిలో ఆయన కృషి కూడా ఎంతో ఉంది. ఇక ఈ చిత్రకథ కోసం ఆయన ఒకటిన్నర సంవత్సర సమయాన్ని వెచ్చించారు. బైలింగ్వల్ చిత్రమిది. ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళ వెర్షన్ షూటింగ్ కూడా చేస్తున్నారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొత్తంమీద ఓ మంచి టీమ్‌తో కలసి 3డి సినిమా చెయ్యటం ఓ కొత్త అనుభవం' అని అన్నారు.
దర్శకుడు అనిల్ సుంకర మాట్లాడుతూ, 'ఓ చక్కటి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం బాగా వస్తున్నదంటే అందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉంది. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది. త్వరలో బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్, గోవాలో ఓ షెడ్యూల్ చేస్తాం' అని చెప్పారు.
బిందాస్', 'అహనా పెళ్లంట' చిత్రాల నిర్మాత అనిల్ సుంకర దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ్‌లో 3డిలో తెరకెక్కుతోంది. అల్లరి నరేష్, కిక్‌శ్యామ్, రాజు సుందరం, వెైభవ్, స్నేహ ఉల్లాల్, కామ్న జెఠ్మలాని, రీతు బర్మేచ, నీలం ఉపాధ్యాయ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం, నాజర్, జయప్రకాష్, మనోబాల, ఝాన్సీ, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, కళ: నాగేంద్ర, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, స్టీరియోగ్రాఫర్: కేత్ డ్రివర్(యుఎస్‌ఎ), సంగీతం: బప్పా-బప్పీలహరి, నేపథ్యసంగీతం: ఎస్.ఎస్.తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ-కథనం-దర్శకత్వం: అనిల్ సుంకర.