»   » బన్ని నెక్స్ట్ చేసే సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్

బన్ని నెక్స్ట్ చేసే సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ గురించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇన్నాళ్లూ తెరపై హీరోగా మరిపించిన ఆయన విలన్ గా కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది.

అల్లు అర్జున్‌ ఇప్పుడు తమిళ దర్శకుడితోనే పనిచేయబోతున్నాడు. 'సరైనోడు' తరవాత ఆయన లింగుస్వామితో సినిమా చేస్తున్నారు. వచ్చే నెల్లో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం లో ఆయన విలన్ గానూ, హీరోగానూ కనిపించి మురిపించనున్నట్లు వార్త.

ఆర్య 2 లో నెగిటివ్ గా కనిపించిన ఆయన లింగు స్వామి దర్శకత్వంలో పూర్తి స్దాయి విలన్ గా కనిపిస్తాడంటున్నారు. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో బన్నీని లింగు స్వామిని కలిసి ఈ కొత్త స్టోరీ లైన్ చెప్పటం జరిగిందిట. ఆ క్యారక్టరైజేషన్ పిచ్చ పిచ్చగా నచ్చేసిన అల్లు అర్జున్ తమ కొత్త సినిమాకు సంబంధించిన చర్చలపై కూర్చున్నారని ఇన్ సైడ్ టాక్.

 Is Allu Arjun Playing A Villain Role In Next Movie?

పందెం కోడి వంటి పక్కా మాస్ సినిమాలు తీసిన లింగు స్వామి...మాస్ సినిమాలను, హీరోయిజాన్ని పెర్ఫెక్ట్ గా చూపించడంలో తిరుగు లేదు. బన్నీ లింగుస్వామి కలిసి తీస్తే మాత్రం, సినిమాపై గ్యారంటీగా భారీ అంచనాలు ఏర్పడతాయనడంలో సందేహం ఏ మాత్రం లేదు. కాగా, సరైనోడి కలెక్షన్లు స్టడీగానే చాలా చోట్ల ఉన్నాయి.

ఇక కేవలం విలన్ గానే కాకుండా ...ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనుండటం ప్లస్ అవుతుందన్నమాట. అంటే సూర్య చేసిన 24లో లాగ రెండు పాత్రలూ అల్లు అర్జున్ చేస్తాడన్నమాట. ఒకటి హీరో.. మరోటి విలన్ పాత్ర . ఇప్పటివరకూ మనం చూసిన బన్నీ వేరు.. ఈ సినిమాలో కనిపించబోయే బన్నీ వేరు అని తమిళ సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. అయితే ఇది కేవలం రూమరేనా, ఎంత వరకూ నిజం ఉంది అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
The latest buzz in the Tamil industry is that Allu Arjun may be seen as a villain in his upcoming movie directed by N. Lingusamy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu