»   » మూలాలు మరిచి ప్రవర్తిస్తున్న అనుష్క?

మూలాలు మరిచి ప్రవర్తిస్తున్న అనుష్క?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క తన మూలాలు మరిచి బిహేవ్ చేస్తోందని,ఆమె ఆంద్రప్రదేశ్ తన సొంత రాష్ట్రం అనుకుంటోందని కన్నడ నిర్మాత రీసెంట్ గా ఘాటుగా ఆమెను మీడియాలో విమర్శించారు. అందుకు కారణం..ఆమెకు ఓ కన్నడ సినిమాలో శివరాజకుమార్ ప్రక్కన చేయమంటూ వచ్చిన ఆఫర్ ని తిరస్కరించటమే. దాంతో తమ సూపర్ స్టార్ ప్రక్కన చేయటానకి తమ రాష్ట్రానికే చెందిన హీరోయిన్ కి నామోషీనా అంటూ మండిపడుతున్నారు. అయితే అనుష్క తనకు ప్రస్తుతం డేట్స్ ఖాళీలేవని, ఆ నిర్మాత మూడు నెలలు కంటిన్యూగా డేట్స్ అడిగాడని అందుకే రిజెక్టు చేయవలసి వచ్చిందని చెప్తోంది. అలాగే ఏ కన్నడ హీరోయిన్ కీ ఆఫర్ చేయని మొత్తాన్ని ఆమెకు ఆఫర్ చేసామని, ఆమె మూడు నెలలు కూడా తెలుగు పరిశ్రమని విడిచి ఉండలేనని నిష్కర్షగా చెప్పిందని ఆ నిర్మాత అనుష్కని కన్న తల్లినే మరిచిన ద్రోహిగా అభివర్ణిస్తున్నాడు. ఇక ఈ వారంలో ఆమె నటించిన ఖలేజా చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu