twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'ఈగ' చిత్రం ఆ షార్ట్ పిలిం కాపీ?

    By Srikanya
    |

    హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఈ చిత్రం పై నేషనల్ మీడియాలో రకరకాలు కథనాలు వెలుబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ చిత్రం ఓ ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. ఆ షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). మార్చి 2010లో వచ్చిన ఈ షార్టి ఫిలిం కథ దర్శకుడు లూక్ ఈవ్ (Luke Eve). ఈ షార్ట్ ఫిలింలో ప్రేమలో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి బొద్దింక గా పునర్జన్మ ఎత్తుతాడు. బొద్దింకగా తన గర్ల్ ప్రెండ్ ని కలుసుకుంటాడు. అది ఓ రొమాంటిక్ కామెడీ. అయితే రాజమౌళి తన తండ్రి దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ కథను తనకు చెప్పారంటున్నారు.

    ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్ మక్కి రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని రాజమౌళి ఖరారు చేసినట్లుగా నటుడు సుదీప్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ..." ఈగ హిందీ వెర్షన్ అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు. డైరక్టర్ రాజమౌళి ఈ విషయాన్ని ఖారుర చేసారు. ఇది ఓ గ్రేట్ న్యూస్. ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను " అన్నారు.

    హిందీకి మార్పులు ఏముంటాయి అని మీడియా వారు రాజమౌళిని సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ... ఈగ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ని సంప్రదించినట్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అలాగే హిందీలో 3D వెర్షన్ ని కూడా విడుదల చేయటంలేదు. అయితే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నాం. అవేమిటంటే...తెలుగు మాదిరిగానే హిందీలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ డాన్స్ లను ఈగ చేయటం పెడుతున్నాం. అందుకు టైమ్ పడుతుంది అన్నారు.

    సురేష్ బాబు మాట్లాడుతూ... దబాంగ్, బాడీగార్డ్ లోని పాటలను ఈగ కోసం తీసుకుంటున్నాం అన్నారు. అలాగే త్రీడి లో చేస్తామని మీరు కూడా గతంలో అన్నారు కదా అంటే..మొదట్లో త్రిడీ వెర్షన్ నే విడుదల చేద్దామనుకున్నాం. కానీ అందుకు చాలా టైమ్ పట్టెటట్లు ఉంది అన్నారు. అలాగే ఏడు కోట్లు ఎగస్ట్రా అవుతుంది అది కూడా పరగణలోకి తీసుకోవాలి అన్నారు. ఈగ తెలుగులోనే కాక,తమిళ,మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది.

    నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌ బాబు.

    English summary
    Buzz is that Telugu film Eega bears a stark resemblance to an Australian short film 'Cockroach'. While a lot of curiosity has gathered around the upcoming Telugu film Eega, buzz is that a certain amount of ‘inspiration’ has been borrowed for the film from an Australian short film. Our sources say that Eega/Makkhi has a very strong resemblance to the shorts titled Cockroach made by filmmaker Luke Eve. Cockroach released in Australia in March, 2010.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X