»   » బన్నీ హీరోయిన్ ను లైన్లో పెట్టాలంటే ఫస్ట్ ఆమె కుక్కను లైన్లో పెట్టాలట..

బన్నీ హీరోయిన్ ను లైన్లో పెట్టాలంటే ఫస్ట్ ఆమె కుక్కను లైన్లో పెట్టాలట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సొమ్ములుంటే ఏదైనా చేయవచ్చని జెనీలియా నిరూపించింది. దాంతో ఇండస్ట్రీలో కుర్రహీరోలు ఆమెను ఆటపట్టిస్తున్నారు. విషయం ఏమిటంటే.. తాజాగా జెనీలియా తన కుక్కపిల్ల పుట్టినరోజు ఘనంగా చేసింది. ముద్దుగా పెంచుకుంటున్న దాని పేరు 'లైకా". ఆ సందర్భంగా ఓ పాట కూడా పాడిందట.

యువహీరో రామ్...నీ కుక్క ఒట్టి మొండి ఘటమని పరోక్షంగా ఆమెనుద్దేశించి కుక్కను అడ్డం పెట్టుకుని రకరకాలుగా కామెంట్స్ చేశాడట. అదేమీ పట్టించుకోని జెనీలియా...నా మాట వింటే చాలు...పరుగెత్తుకుంటూ వచ్చి ఒళ్లో వాలిపోతుందని జెనీలియా ముద్దుగా చెప్పింది. దాంతో రామ్...అయితే ఏదీ ఎలా వస్తుందో ఒక్కసారి చూపించు అని...నేను నువ్వు, నీ కుక్క నువ్వు అంటూ..సరదాగా ఆట పట్టించాడట. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా నవ్వేశారు. మరో హీరో సిద్దార్థ మాత్రం ఈమెను లైన్‌ లో పెట్టాలంటే ముందుగా కుక్కను పెట్టాలన్నమాట అని అనడంతో ఒక్కసారి నవ్వులు పూచాయి. ఇటీవలే ఓ ఫంక్షన్‌ లో ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu