Don't Miss!
- News
Yotube: యూట్యూబ్ సంపాదనతో ఆడి కారు కొన్న యువకుడు..
- Travel
చారిత్రక నిర్మాణాల సిరి.. రత్నగిరి!
- Finance
UPI Payments: యూపీఐ యూజర్స్ బి అలర్ట్.. డిజిటల్ చెల్లింపులపై లిమిట్స్ ఇవే..
- Lifestyle
పురుషులు సోయా మిల్క్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు డయాబెటిస్ రాకుండా చేస్తుందా?
- Automobiles
రూ. 50 లక్షల ఖరీదైన కారు కొన్న యుట్యూబర్.. ఆ కారు ఏదో ఇక్కడ చూడండి
- Sports
Shubman Gill: జిడ్డు బ్యాటర్.. వద్దు బాబోయ్ అన్నారు! డబుల్ సెంచరీతో బల్లగుద్ది చెప్పాడు!
- Technology
ఈ ఫోన్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్! వివరాలు!
కిమ్ శర్మతో హర్షవర్ధన్ రాణే డేటింగ్.. పబ్లిక్‌గా దొరికిన జంట.. గుత్తా జ్వాలాకు గుడ్‌బై!
టాలీవుడ్, బాలీవుడ్‌లో అప్పుడప్పుడు కనిపిస్తుండే హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటి కిమ్ శర్మ మధ్య అఫైర్ జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. వీరిద్దరూ లంచ్ డేట్‌కు వచ్చి ముంబైలోని ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌లో ఫోటో జర్నలిస్టుల కంటికి చిక్కారు. మీడియా హడావిడి చూసి వీరద్దరి ఒంటరిగా కూర్చొవడం కనిపించింది. ఒంటరిగా నవ్వుతూ వీరద్దరి ఫొటోలకు ఫోజిచ్చారట. అనంతరం ఇద్దరు కలిసి మూవీకి వెళ్లినట్టు మీడియా కథనం వచ్చింది. వివారాల్లోకి వెళితే..

హర్షవర్ధన్ రాణేతో కిమ్ శర్మ
ముంబైలోని బాంద్రా రెస్టారెంట్‌లో జంటగా కనిపించిన కిమ్ శర్మ, హర్షవర్ధన్ రాణేను మీడియా పలుకరించగా పెద్దగా మాట్లాడటానికి నిరాకరించారట. హర్షవర్ధన్ రాణే నటించిన పల్టాన్ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజైంది. ఆ సందర్భంగానే లంచ్ డేట్‌కు వచ్చినట్టు తెలుస్తున్నది. వీరిద్దరి వ్యవహారం గత కొద్దినెలలుగా మీడియాలో చర్చనీయాంశమైంది.

అలీ పుంజానీతో కిమ్ శర్మ పెళ్లి
బాలీవుడ్‌లో కెరీర్ ఉన్నతస్థానంలో ఉండగా, అలీ పుంజానీని కిమ్ శర్మ వివాహం చేసుకొన్నారు. కెన్యాలో అలీ పుంజానీ బడా వ్యాపారవేత్త. వివాహం తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయారు.

భర్తను వదిలేసి కిమ్ శర్మ
గొడవల మధ్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా భార్తను వదిలేసి కిమ్ శర్మ ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఓ మోడల్‌తో అఫైర్ పెట్టుకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా హర్షవర్ధన్‌తో కలిసి తిరుగుతూ మీడియాను ఆకర్షించింది.

గౌహర్‌తో హర్షవర్ధన్
ఇక తొలుత హర్షవర్ధన్ రాణేకు బాలీవుడ్ నటి గౌహర్‌ఖాన్‌తో అఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్‌లో చిన్నా చితక హీరో వేషాలు వేస్తున్న తరుణంలో బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాతో అఫైర్ ఉందంటూ వార్తలు వెలుగు చేశాయి. అయితే వాటికి మీడియాలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

గుత్తా జ్వాలాతో హర్షవర్దన్ అఫైర్
సినీ పరిశ్రమలో స్థిరమైన స్థానం సంపాదించుకొనేందుకు ఓ వైపు ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు అందమైన భామలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం హర్షవర్ధన్‌కు అలవాటుగా మారింది. సనమ్ తెరీ కసమ్‌లో నటించిన హీరోయిన్ మార్వా హోకేన్‌తో అఫైర్ నడిపించాడనే వార్తలు కూడా హల్‌చల్ సృష్టించాయి.

ఖడ్గం చిత్రంలో కిమ్ శర్మ
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రంలో కిమ్ శర్మ హీరోయిన్‌గా నటించింది. రవితేజ చిత్రం ఆంజనేయులులో ఐటమ్ నంబర్‌లో కనిపించింది. తెలుగులో చివరిసారిగా మగధీర సినిమాలో ఓ ఐటెంగ్ సాంగ్‌లో ఆకట్టుకొన్నది.