For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రవితేజ తప్పు చేస్తున్నాడా?

  By Staff
  |

  రవితేజ హీరోగా బెల్లంకొండ సురేష్ తమిళ సూపర్ హిట్ 'నానోడిగల్' రీమేక్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రవితేజకు సూట్ కాదు అని అంతటా వినపడుతోంది. ఏదో క్రేజ్ కోసం బెల్లంకొండ కాంబినేషన్ సెట్ చేసినా అది మరో నా ఆటోగ్రాఫ్ లా అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఫీల్ గుడ్ పిల్మ్ ని రీమేక్ చేసేటప్పుడు అందుకు తగ్గ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టును తీసుకోవాలని లేకపోతే కష్టమని చెప్తున్నారు. ఇంతకీ తమిళంలో కథ ఈ ప్రకారం ఉంటుంది.

  కథ ముగ్గురు స్నేహితులు చుట్టూ నడుస్తుంది.మెయిన్ హీరో కరుణాకరన్(శశికుమార్)తన మేనమామ కూతురు నల్లమ్మతో ప్రేమలో ఉంటాడు. అతనికి గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఆమెనిచ్చి పెళ్ళి చేస్తానని మేనమామ కండీషన్ పెడతాడు. ఇక మరో ప్రెండ్ అబ్రాడ్ వెళ్ళి సంపాదించాలని, మరొకడు కంప్యూటర్ సెంటర్ పెట్టి బాగుపడాలని అనుకుంటాడు. అయితే ఇవన్నీ సవ్యంగా జరుగుతూండగా వారి జీవితాల్లోకి శరవణ్ ప్రవేశిస్తాడు. అతను వారి బాల్య స్నేహితుడు. ఓ మాజీ ఎంపి కుమారుడు. అతను ప్రభ అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆమె తండ్రి ఓ పెద్ద కోటీశ్వరుడు. అతను తన ప్రేమ సక్సెస్ కాలేదని ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాడు. దాంతో ఈ ముగ్గురు మిత్రులు శరవణ్ కి ఆమెను ఇచ్చి పెళ్ళి చేస్తామని ప్రామిస్ చేస్తారు. అందుకు తగినట్లుగానే తమ మరో స్నేహితుడుతో పెద్దలకు తెలియకుండా సాహసంతో వారి పెళ్ళి చేస్తారు.అయితే ఈ విషయం తెలిసుకున్న వారి పెద్దలు ఒకడికి కాలు తీసేస్తారు. మరొకడుకి వినికిడి శక్తిని దెబ్బతీస్తారు. ఇక మెయిన్ హీరో కి అతని కుటుంబాన్ని దెబ్బ తీస్తారు. ఇదిలా ఉంటే ఎంతో ఇష్టపడి చేసుకున్నామన్న ఆ జంట వారంలోపే అభిప్రాయ బేధాలతో విడిపోతారు. దాంతో వారి త్యాగానికి అర్ధమే లేకుండా పోతుంది. చివరకు ఆ జంటకు వారు ఎలా బద్ది చెప్పి కలిపారన్నది క్లైమాక్స్.

  ఇక తమిళంలో ఏ ఇమేజ్ లేని శశికుమార్(అనంతపురం 1980 ఫేమ్) మెయిన్ పాత్రను పోషించి సినిమాను ఎక్కడకో తీసుకెళ్ళాడు. ఆ పాత్రలో రవితేజ ఎంతవరకూ ఒదుగుతాడన్నది వేచిచూడాల్సిందే. అలాగే రవితేజ ప్రెండ్స్ గా అల్లరి నరేష్,సునీల్ కూడా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తమిళ దర్శకుడు సముతిరాకని తెలుగులో దర్శకుడుగా పరిచయం కానుండటం విశేషం.అంతేగాక కన్నడ రీమేక్ ఈ ఏడాది చివర్లో ఉండబోతోందనీ, సూపర్ స్టార్ పునీత్ కథానాయకుడిగా నటించనున్నారనీ తెలుస్తోంది. హిందీ లో సైతం ఈ చిత్రం చేయటానికి పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇవన్నీ ప్రక్కన పెడితే ఇన్నాళ్ళూ ఎంటర్టైన్ మెంట్ తో వెళ్తున్న రవితేజ పాత్ర ఈ సినిమాకు ఏమన్నా మారుస్తారో చూడాలి.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X