twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీకైంది: ఎన్టీఆర్ 'టెంపర్‌' కథ ఇదా?మూలం ఉందా?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్‌, కాజల్‌ జంటగా 'టెంపర్‌' చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఇటీవల గోవాలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. రీసెంట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై ప్రాజెక్టుకు మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ లీకైందంటూ వెబ్ మీడియాలో ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. ఈ కథ కరెక్టా కాదా అన్నది సినిమా రిలీజైతే కానీ తెలియదు...సరదాగా ఆ కథపై ఓ లుక్కేయండి. వారు చెప్తున్న కథలో బాలకృష్ణ ...లక్ష్మీ నరసింహ పోలీకలు ఉన్నా...గతంలో తమిళంలో వచ్చిన పార్ధీపన్ 1993 లో వచ్చిన Ulle Veliye కథనుంచి ప్రేరణ పొంది తయారు చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    టెంపర్ స్టోరీలైన్ ఈ విధంగా సాగుతుంది. ఫస్టాఫ్ లో....ఎన్టీఆర్...లంచాలు పుచ్చుకుంటూంటాడు. అ క్రమంలో వైజాగ్ లో ఉండే ప్రకాష్ రాజ్ నుంచి లంచం తీసుకుంటాడు. అయితే అతనికి హ్యాండ్ ఇస్తాడు. అతని పనులేమీ చెయ్యడు. ఈ లోగా కొన్ని ట్విస్ట్ లు టర్న్ లు తర్వాత...ఇంటర్వెల్ ముందు... ఎన్టీఆర్ నిజాయితీ గల పోలీస్ అధికారిగా మారతాడు. ఇంటర్వెల్ అయిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో ఈ విషయం తెలియని ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే.. ఎన్టీఆర్ సాయం తీసుకుంటాడు. అతనికి..సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూ...అతని సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసాడనేది మిగతా కథ. చివరకు తన తప్పులన్ని ఒప్పుకుని ప్రకాష్ రాజ్ చట్టానికి లొంగిపోవటంతో కథ ముగుస్తుంది. అలాగే ఎన్టీఆర్ కరెప్ట్ పోలీస్ అధికారి కావటానికి కారణమేంటనేది ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందని, పక్కా మాస్ చిత్రం అని తెలుస్తోంది.

    ఎన్టీఆర్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ గోవాలో యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

    Is it NTR's Temper Story line?

    మరో ప్రక్క...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

    షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

    ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, ఆలీ. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిశోర్‌, జయ ప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, పవిత్ర వంటి స్టార్‌ కాస్టింగ్‌ అంతా నటించడం కూడా ఈ సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు

    English summary
    NTR’s Temper story line is strongly inspired from Parthiban’s Ulle Veliye movie, added sources. Temper was initially in Sankranti race to get released on 9th Jan, 2014 .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X