»   » ఎన్టీఆర్ వీరాభిమాని, దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం... నిజమేనా?

ఎన్టీఆర్ వీరాభిమాని, దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆత్మహత్యాయత్నం... నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి గురించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో సంచలనం అయింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో పుకార్లు షాకార్లు చేస్తున్నాయి. ఈ విషయం విని అటు అభిమానులు కూడా షాకయ్యారు.

అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలేవీ బయటకు రాలేదు. వైవిఎస్ చౌదరిగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఈ విషయమై స్పందించేందుకు అందుబాటులో లేరు. దీంతో ఇది నిజమో? లేక పుకారో? తెలియక అయోమయం నెలకొంది.

ఎన్టీఆర్ వీరాభిమాని

ఎన్టీఆర్ వీరాభిమాని

ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవిఎస్ చౌదరి ఆయన్ను చూసి ఇన్స్‌సైర్ అయి తెలుగు సినిమా రంగం వైపు అడుగులు వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Ramajogayya Sastry @Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
తొలి నాళ్లలో హిట్స్

తొలి నాళ్లలో హిట్స్

1998లో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన వైవిఎస్.... తొలి సినిమాతో మంచి విజయమే అందుకున్నారు. అనంతరం హరికృష్ణ, నాగార్జున లతో తీసిన సీతారామరాజు సక్సెస్ కావడంతో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మహేష్ బాబుతో...

మహేష్ బాబుతో...

అప్పట్లో మహేష్ బాబు రెండో సినిమా ‘యువరాజు' డైరెక్టర్ చేసే అవకాశం వైవిఎస్ చౌదరికి దక్కింది. అయితే ఈ చిత్రం పెద్ద విజయం సాధించక పోయినా మంచి ఫలితాలనే ఇచ్చింది.

నిర్మాతగా వరుస విజయాలు

నిర్మాతగా వరుస విజయాలు

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చౌదరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత సీతయ్య, దేవదాసు చిత్రాలు కూడా సొంతగా నిర్మించి సక్సెస్ అయ్యారు.

వరుస ప్లాపులతో ఆర్థికంగా కుదేలు

వరుస ప్లాపులతో ఆర్థికంగా కుదేలు

అయితే 2008లో బాలయ్యతో తీసిన ‘ఒక్క మగాడు' సినిమా చౌదరికి భారీగా నష్టాలు మిగిల్చింది. ఆవెంటనే తన దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ‘సలీమ్'కూడా పెద్ద ప్లాప్. ఈ రెండు పరాజయాలతో అటు అర్థికంగా నష్టపోవడం, ఇటు కెరీర్ పరంగా కిందకు పడిపోవడం జరిగింది.

‘రేయ్' గట్టెక్కించలేదు

‘రేయ్' గట్టెక్కించలేదు

దర్శకుడిగా అవకాశాలు లేక పోవడంతో 2015లో మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తనే నిర్మాతగా ‘రేయ్' చిత్రాన్ని తీసిన చౌదరి మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

English summary
Film Nagar source said tthat, popular telugu director YVS Chowdary attempted suicide. The man who was once in the reckoning for super hit films had been on a streak of delivering only duds and he had spent way too much money into the making of these. Too much of financial debts may have led him to this step.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu