»   » దిల్ రాజు మాములోడు కాదు: ఫ్లాఫ్ నుంచి కూడా ఫ్రాఫెట్ సంపాదించాడు?

దిల్ రాజు మాములోడు కాదు: ఫ్లాఫ్ నుంచి కూడా ఫ్రాఫెట్ సంపాదించాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా సర్కిల్స్ లో దిల్ రాజు చాలా తెలివైన వాడని పేరు. కేవలం డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఎన్నో సక్సెస్ లు చూసారు. కథను జడ్జ్ చేసే తన నాలెడ్జ్ తో సూపర్ హిట్స్ కొట్టారు. అలాంటిది ఫ్లాఫ్ లోంచి ఫ్రాఫెట్ తీయటం గొప్ప విశేషం అయితే కాదు .

ఇది వలసల సమయం..ఇక్కడ తెలుగు హీరోలంతా వేరే లాంగ్వేజ్ లలోనూ తమ చిత్రాల రిలీజ్ కావాలని అటు వైపు చూస్తూంటే, వేరే లాంగ్వేజ్ హీరోలు ఇక్కడ తెలుగులో తమ మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా తమిళ హీరో శివ కార్తికేయన్ ఇక్కడ మార్కెట్ పై కన్నేసారు. శివ తమిళంలో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసారు. కానీ ఏ సినిమా ఇక్కడ డబ్ అవ్వలేదు. దాంతో ఆయన తన తాజా చిత్రం రెమో డబ్ చేసి ఇక్కడ దింపారు.


అయితే తెలుగులో తమ రెమో చిత్రం డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుని ఎంచుకున్నారు. ధియోటర్స్ నుంచి, ఆయన బ్యానర్ వ్యాల్యూ దాకా తమకు ఉపయోగపడుతుందని భావించారట. తెలుగులో పబ్లిసిటీ కోసం రెండు కోట్ల రూపాయలు దిల్ రాజు కు చెల్లించారట.


Is it true? Profit in loss for Dil Raju

అంతేకాకుండా బ్యానర్ వాడుకున్నందుకు కూడా మంచి ఎమౌంట్ పే చేసారని సమాచారం. అంతేకాకుండా తెలుగులో రిలీజ్ చేసిన ధియేటర్ రెంట్ లు సైతం కట్టారట. కేవలం దిల్ రాజు...ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన సినిమా అని చెప్పటం, తన గుడ్ విల్ ని వాడటం చేసారట. అంతేకానీ ఆయన చెప్పినట్లుగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేయలేదట.


ఇదంతా తమిళంలో రెమోని నిర్మించిన ఆర్ డి రాజా చేసారని సమాచారం. ఆర్ డి రాజా..శివ కార్తికేయన్ డేట్స్ చూస్తూంటారు. ఆయన ఆలోచనలతో నే తెలుగులో మార్కెట్ ని విస్తరించటానికి ఇక్కడ రిలీజ్ చేసారన్నమాట. అయితే తెలుగులో ఈ సినిమా అనుకున్నంతగా నడవలేదు. దాంతో దిల్ రాజు..ఫ్లాఫ్ సినిమా నుంచి కూడా ఫ్రాఫెట్ తీసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అదీ సంగతి .

English summary
Sivakarthikeyan wants to use the producer’s banner for the Telugu Remo release. He also gave Rs 2 crore for the publicity of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu