»   » హిట్ టాక్ ..అయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు

హిట్ టాక్ ..అయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గజిని, సింగం వంటి చిత్రాలతో తెలుగు,తమిళ అనే భాషా భేధం లేకుండా అలరించిన సూర్య లేటెస్ట్ చిత్రం 24. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మీడియా నుంచి మాత్రమే కాక అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

అయితే ఈ సినిమా అద్బుతమైన స్క్రీన్ ప్లే తో , సూర్య ఫెరఫార్మెన్స్ తో అదరకొట్టినా..లెంగ్త్ టైమ్ మరీ ఎక్కువ ఉందనే విమర్శలు అంతటా వచ్చాయి. అలాగే సూర్య, సమంతల మధ్య వచ్చే లవ్ ట్రాక్ సైతం వీక్ గా ఉందని రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాని ట్రిమ్ చేయాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

Is it True?: suriya's 24 Trimmed?

స్లో పేస్ ఉన్నచోట్ల, బోర్ కొడుతుంది, రిపీట్ అవుతుందని ఫీలైన చోట్ల కత్తెర వేసి మినిమం 9 నిముషాల వరకూ ట్రిమ్ చేయాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ట్రిమ్మింగ్ వేటు..సమంత , సూర్య లవ్ సీన్ల పై పడనుందని తెలుస్తోంది.


టైమ్ మిషన్ నేపధ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో సూర్య , వాచ్ మెకానిక్ గా, విలన్ ఆత్రేయ గా, సైంటిస్ట్ శివకుమార్ గా నటించి అదరహో అనిపించాడు. చిత్రానికి మంచి పాజిటీవ్ టాక్ రావడంతో ఆల్ ఓవర్ ఇండియా మొదటి రోజు 25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుంటే ఈ కలెక్షన్స్ ఫిగర్ ఇంకా పెరగనుంది.

English summary
Surya, Samantha, Nitya Menon’s sci-fi thriller 24 makers are analyzing the feedback decided to trim around 9 minutes of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu