»   » సీక్వెల్ వార్త నిజమైతే...మహేష్ ఫ్యాన్స్ కు పండుగే

సీక్వెల్ వార్త నిజమైతే...మహేష్ ఫ్యాన్స్ కు పండుగే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడస్తుంది. మహేష్ కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినపడుతున్నాయి. కృష్ణ వంశీ దర్శకత్వంలో గతంలో రూపొంది సూపర్ హిట్టైన మురారి చిత్రం సీక్వెల్ రూపొందే అవకాసం ఉందంటున్నారు. దానికి కారణం రీసెంట్ గా రిలీజైన చిత్రంలో సీన్ కావటం విశేషం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ సీన్ మరేదో కాదు.. సూపర్ స్టార్ కిడ్నాప్ అనే టైటిల్ తో వచ్చిన చిత్రంలో మహేష్ బాబు...మురారి 2 చిత్రం చేస్తున్నట్లు క్లాప్ బోర్డ్ పై చూపెడతారు. దాంతో అవును కదా...మురారి సీక్వెల్ చేస్తే బాగుంటుందని చర్చలు మొదలయ్యాయి. మరి మహేష్ ఏమంటారో చూడాలి.

ఇక మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' విశేషాలకు వస్తే....

ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఉన్న అనుమానాలు,రూమర్స్ కు తెరదించుతూ...చిత్రం నిర్మాతలు, దర్శకుడు కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. ఆగష్టు 7న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9. అంటే పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగానే కానుక వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.

Is it work with ‘Murari 2’ to Mahesh?

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మరోప్రక్క ‘శ్రీమంతుడు' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.

అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినమాలో ది మాత్రం కాదన్నారు.

మరో ప్రక్క తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

అలాగే పూరి, మహేష్ చిత్రం విషయానికి వస్తే..

పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'లోఫర్' అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో మరో టాపిక్ ...ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. గతంలో పూరి ... 'టపోరి' టైటిల్ పెడతారని వినపడింది. అంటే ఇప్పుడా టైటిల్ ని ... మహేష్ బాబు చిత్రానికి పెడతారంటున్నారు.

దానికి కారణం ఇప్పటికే మహేష్ బాబు తన కథ ఓకే చేసాడని పూరి ప్రకటించటమే. ఈ నేపధ్యంలో ఈ 'టపోరి' టైటిల్ అంతటా ఆసక్తిగా మారింది. అందులోనూ ఇలాంటి సిమిలర్ టైటిల్ పోకిరితో గతంలో పూరి, మహేష్ కాంబినేషన్ లో చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ మహేష్ కు 'టపోరి' టైటిల్ ఎలా ఉంటుంది.

English summary
Talks are going that ..Mahesh will oblige to do a sequel to Murari, in case if Krishna Vamsi comes up with a fantastic story?
Please Wait while comments are loading...