SSMB29: హాలీవుడ్ లెజెండ్‌తో మహేష్ SSMB29 ఫస్ట్ లుక్.. గ్లింప్స్‌కు జక్కన్న ప్లాన్ ఎప్పడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తాత్కాలిక టైటిల్‌గా SSMB29 అని వ్యవహరిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు, వెలుగు చూస్తున్న విశేషాలు అందరిలోను ఆసక్తిని రేపుతున్నాయి. ఈ సినిమా గురించి వెలుగులోకి వచ్చిన ఓ వార్త గురించి, అలాగే ఈ సినిమా గురించిన విశేషాల్లోకి వెళితే..
మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ మాధవన్, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియదర్శి పులికొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ రాజమౌళి కథను అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, టోడోర్ లాజరోవ్ స్టంట్స్ కోరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలుపెట్టి.. ఓరిస్పాలో కూడా పూర్తి చేశారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం నైరోబిలో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సీన్లను చిత్రకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాలోని నైరోబికిమహేష్ బాబు, ప్రియాంక చోప్రా చేరుకొన్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజున ఏదైనా గ్లింప్స్ గానీ.. ఫస్ట్ లుక్ గానీ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఉద్దేశం లేదని రాజమౌళి ఫ్యాన్స్‌కు తేల్చి చెప్పారు. అప్పటి నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరో గురించిన గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే మహేష్ బాబు అభిమానులను సంతోషపరిచే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌కు Gen63 అనే పేరును ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌ను హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన తన చిత్రం అవతార్: ది ఫైర్ అండ్ యాష్ అనే సినిమా ప్రమోషన్స్‌కు ఇండియాకు వచ్చిన సమయంలో ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసే విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు అని తెలిపారు.
ఇక పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ మూవీగా మార్చేందుకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఈ సినిమాను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో భారీగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











