ఎన్టీఆర్ డ్రాగన్ ఆగిపోయిందా? ప్రశాంత్ నీల్‌తో అలాంటి గొడవలా?
సినిమా ఇండస్ట్రీలో వాస్తవాల కంటే రూమర్లు, గాసిప్స్‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. తారల మధ్య బంధాలు, సినిమాల రిలీజ్ డేట్స్, హీరో, డైరెక్టర్ల కాంబినేషన్స్ లాంటి విషయాలపై అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో స్టార్ హీరో, టాప్ డైరెక్టర్ సినిమా విషయంలో ఎక్కువ చర్చ జరిగింది. అయితే ఆ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే నిజంగా ఆ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందా? ఆ హీరో తదుపరి సినిమా ఏంటి? అనే విషయంలోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా మారిన వాటిలో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించేందుకు ప్లాన్ చేసింది. ఆ సినిమా గురించి మైత్రీ నిర్మాతల్లో ఒకరు గొప్పగా ఎలివేషన్ ఇచ్చారు. దాంతో ఆ సినిమా గురించి అంచనాలు భారీగా పెరిగాయి. ఆ క్రమంలో ఎన్టీఆర్, నీల్ సినిమా గురించి ఆసక్తి పెరిగిపోయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మైత్రీ నిర్మాతల్లో ఒకరు మాట్లాడుతూ.. తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ ప్రాజెక్టు విషయంలో అంతా ఎన్టీఆర్ నిర్ణయమే. ఆయనకు కథ నచ్చి.. ప్రశాంత్ నీల్‌తో సినిమా చేద్దామని అన్నారు. కేజీఎఫ్ సినిమా బాగా నచ్చి ప్రశాంత్ నీల్‌తో ట్రావెల్ అయ్యారు. తారక్ స్వయంగా ఆయనతో సినిమా చేద్దామని ప్రపోజల్ తీసుకొచ్చారు. అలా డ్రాగన్ సినిమా మా ముందుకు వచ్చింది అని మైత్రీ నిర్మాత నవీన్ ఎర్నేని అన్నారు.
అలాంటి టాప్ ప్రాజెక్టు విషయంలో సోషల్ మీడియాలో రూమర్లు భారీగా వస్తున్నాయి. ఈ సినిమా క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయింది. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మధ్య కథ, సన్నివేశాల విషయంలో కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా ముందుకు పోతుందా? లేదా? అనేది అనుమానస్పదంగా మారింది అనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
అయితే ఈ రూమర్లను తారక్ అభిమానులు ఖండిస్తున్నారు. నీల్, తారక్ సినిమా డ్రాగన్ విషయంలో వస్తున్న రూమర్లన్నీ తప్పు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ తొలి వారంలో గానీ స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్ కంటిన్యూగా సాగుతుంది. మూడు, నాలుగు నెలలపాటు సుదీర్ఘంగా షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు అని అభిమానులు బలంగా చెప్పుకొంటున్నారు.
ఇదిలా ఉంటే.. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొంటున్నారు. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ చేస్తూ.. మరింత సన్నబడ్డారు. చాలా వెయిట్ తగ్గి యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రాగన్ విషయంలో ఇలాంటి రూమర్లు రావడంతో నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ వస్తే.. ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెరుగుతుందేమో.


Click it and Unblock the Notifications











